ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ న‌టుడు టీఎన్ఆర్ కరోనా బారిన ప‌డి చికిత్స పొందుతూ సోమ‌వారం మృతి చెందిన  సంగ‌తి తెలిసిందే . టీఎన్ఆర్ చిరంజీవిని ఇన్స్పిరేష‌న్ గా తీసుకుని ప‌రిశ్ర‌మలోకి వ‌చ్చాన‌ని గ‌తంలో చెప్పారు . ద‌ర్శ‌కుడు అవ్వాల‌న్న ఆశ‌తో వ‌చ్చిన టీఎన్ఆర్ జ‌ర్నలిస్ట్ గా యాంక‌ర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . అంతే కాకుండా ప్ర‌స్తుతం సినిమాల్లోనూ న‌టిస్తూ కొత్త అవకాశాల‌ను ద‌క్కించుకుంటున్నారు . అంతే కాకుండా ఐడ్రీమ్స్ యూట్యూబ్ ఛాన‌ల్ లో సెల‌బ్రెటీల‌ను ఇంట‌ర్యూ చేసిన ఆయ‌న ఎంతో మంది యాంక‌ర్ ల‌కు రోల్ మాడ‌ల్ గా నిలిచారు . అలాంటి టీఎన్ఆర్ మ‌ర‌ణించ‌డంతో సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆయ‌న మృతి ప‌ట్ల సంతాపం ప్ర‌క‌టించారు. కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి టీఎన్ఆర్ కుటుంబాన్ని క‌లిసి లక్ష రూపాయాలు తక్షణ ఖర్చుల కోసం అందజేశారు. టీఎన్ఆర్ మరణవార్త తెలిసిన చిరంజీవి తన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు . మంగళవారం సాయంత్రం టీఎన్ఆర్ భార్యా పిల్లలకు ఫోన్ చేసి పరామర్శించారు . 

దాంతోపాటు లక్షరూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ టీఎన్ఆర్ కుటుంబంతో ఫోన్ లో మాట్లాడుతూ...టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, టీఎన్ఆర్ ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతో ఆకట్టుకునేదని గుర్తుచేశారు. జీవితంలో పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు . ఈ కుటుంబానికి ఎలాంటి అవసరమొచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ సంధ‌ర్భంగా టీఎన్ఆర్ భార్య మాట్లాడుతూ....‘మీరంటే వీరాభిమానం సార్. తన 200వ ఇంటర్వ్యూ మీతోనే చేయాలని అనుకునేవారు. ఇంతవరకు మిమ్మల్ని కలవలేదు. మీరు మాకిలా ఫోన్ చేయడం ఎంతో సంతోషం కలిగించింది’ అంటూ టీఎన్ఆర్ భార్య మెగాస్టార్ తో చెప్పారు .

మరింత సమాచారం తెలుసుకోండి: