సాయి ధరమ్ తేజ్ సరికొత్తగా కరోనాపై స్పందించారు.. ప్రస్తుత కాలంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో  ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ఆదేశాలను అమలు చేయాలని, తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని కూడా సూచించారు. ఈ కరోనా సమయంలో  ఈ భూమిమీద అత్యంత సేఫ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే, అది కేవలం మన ఇల్లు మాత్రమే అంటూ ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని, ఇంట్లో ఉంటూ కూడా మాస్కులు, శానిటైజర్ లు  ఉపయోగించాలని కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.


సాయి ధరమ్ తేజ్ వ్యక్తిగత విషయానికి వస్తే, ఈయన  చదువులో సగటు విద్యార్థి. తన 10వ తరగతి హైదరాబాద్ లో చదివాడు. డిగ్రీ సెయింట్ మేరీ కాలేజీ, ఎం.బి.ఏ ఐ.ఐ.పీఎం లో చదివాడు. "మెగాస్టార్" చిరంజీవి మేనల్లుడుగా సినీ రంగ ప్రవేశం చేసాడు.  వై.వి.ఎస్. చౌదరి "రేయ్" సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టినా, "పిల్లా నువ్వులేని జీవితం" సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అయితే సాయి ధరమ్ తేజ్ కు చిన్నప్పటినుండి నటన మీద ఆసక్తి ఉండడంతో నటన నేర్చుకోవాలని సంకల్పించాడు. ఇక ఆ నేపథ్యంలోనే నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.


అలా 2014 లో పిల్ల నువ్వు లేని జీవితం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత 2015 లో రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఇక 2016లో సుప్రీమ్, తిక్క, 2016లో విన్నర్, నక్షత్రం, జవాన్, 2018 లో జెంటిల్మెన్ , తేజ్ ఐ లవ్ యు, 2019లో ప్రతిరోజూ పండగే , 2020లో సోలో బ్రతుకే సో బెటర్, ఇక ప్రస్తుతం 2021లో రిపబ్లిక్ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకుల లో తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: