టాలీవుడ్ లో లో ఒక సినిమాతో హిట్ కొట్టిన హీరోయిన్ వెంటపడడం దర్శకనిర్మాతలకు అలవాటే. ఆ భామది లక్కీ లెగ్ అనే ముద్ర వేసి మరి ఆ భామ డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి కోసం ఒక టాప్ డైరెక్టర్ ప్రయత్నించి విఫలమయ్యారు.. ఆయన మరెవరో కాదు విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తేజ. తేజ ప్రస్తుతం ఒక సీక్వెల్ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. చిత్రం అని ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. 


ఈ సినిమాకు సంబంధించి నటీనటుల వివరాలు ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు. కానీ తాను ఆ సినిమాలో నటిస్తున్నట్లుగా దగ్గుబాటి అభిరామ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక దగ్గుబాటి అభిరామ్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు గాను ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టిని దర్శకుడు తేజ సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆ భామ తాను నటించలేనని చెబుతూ సున్నితంగా ఆఫర్ తిరస్కరించిందని చెబుతున్నారు. 


ఎందుకు ఏమిటి అనేక కారణాలు వెలుగులోకి రాకపోయినా ఆ భామ ఆఫర్ తిరస్కరించడానికి పెద్ద కారణమే ఉంది అంటున్నారు. ప్రస్తుతం ఈ భామ నాని సరసన శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సుధీర్ బాబు సరసన కూడా మరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రెండు మూడు సినిమాలు పెద్ద హీరోలతో చేస్తుంటే మళ్లీ కొత్త హీరోతో చేస్తే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తాయి ఏమో అన్న ఉద్దేశంతో ఆమె ఈ ఆఫర్ ను తిరస్కరించిన ఉండవచ్చు అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: