టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి తరువాత ప్రస్తుతం ఉన్నవారిలో నెంబర్ వన్ ఎవరీ అనే చర్చ మొదలైన ప్రతిసారీ సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల పేరు ప్రముఖంగా తెరమీదకు వస్తుంటాయి. ఆ విధంగా ఈ ఇద్దరు స్టార్ నటులు భారీ స్థాయి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు విపరీతమైన మార్కెట్ ని కూడా అన్ని ఏరియాల్లో ఏర్పరుచుకున్నారు. ఇటీవల వరుసగా మూడు భారీ సక్సెస్ లతో కెరీర్ పరంగా హ్యాట్రిక్ కొట్టి ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ చేస్తున్నారు మహేష్ బాబు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలానే దీని తరువాత త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, రాజమౌళి లతో మహేష్ సినిమాలు చేయనున్నారు.
మరోవైపు ఇటీవల వకీల్ సాబ్ ద్వారా మూడేళ్ళ అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి ప్రస్తుతం రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందులో ఒకటి సాగర్ చంద్ర తీస్తున్న అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ కాగా మరొకటి హృద్యమైన సినిమాల దర్శకడు క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు మూవీ. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక ఈ ఇద్దరు నటులు ప్రస్తుతం రూ.65 కోట్లవరకు ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ తీసుకున్తున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం ఏమిటంటే ఇటీవల మాస్టర్ మూవీతో మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న ప్రముఖ కోలీవుడ్ స్టార్ ఇలయతలపతి విజయ్, త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఒక భారీ ద్విభాషా సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక విజయ్ కి కూడా భారీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా వంశీ పైడిపల్లి సినిమాకి గాను విజయ్ ఏకంగా రూ. 75 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని, తమిళ్ లో రజినీకాంత్ తరువాత అంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోన్న మరొక సౌత్ హీరో విజయ్ మాత్రమే అని అంటున్నారు. అయితే ఆయనకు సమానమైన క్రేజ్, పాపులారిటీ కలిగిన టాలీవుడ్ హీరోలు మహేష్, పవన్ ఇద్దరూ కూడా రూ. 65 కోట్ల వద్దనే ఉడడంతో ఈ విషయంలో ఒకింత విజయ్ వారిద్దరి పై పైచేయి సాధించినట్లే అంటున్నాయి సినీ వర్గాలు. ఇక వీరందరి కంటే ముందు స్థానంలో ఏకంగా రూ.110 కోట్ల భారీ రెమ్యునరేషన్ తో రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు... !!

మరింత సమాచారం తెలుసుకోండి: