పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ ఏడవ సినిమా ఖుషీ తో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన నటించిన జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి, అయితే ఆ తరువాత బ్రదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన అన్నవరం మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది. దాని అనంతరం వచ్చిన జల్సా సినిమా మంచి హిట్ కొట్టినప్పటికీ పవన్ అభిమానులని ఆ మూవీ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయింది.

ఆ తరువాత వచ్చిన కొమరం పులి, తీన్ మార్, పంజా సినిమాలు మూడూ ఫ్లాప్ కావడంతో పవన్ కెరీర్ పరంగా కొంత ఇబ్బందుల్లో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో బండ్ల గణేష్ నిర్మాతగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై హరీష్ శంకర్ దర్శకత్వంలో హిందీ మూవీ దబాంగ్ కి రీమేక్ గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద విజయం అందుకుని ఎన్నో ఏళ్ళుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ ఆకలిని తీర్చింది గబ్బర్ సింగ్. ముఖ్యంగా ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి గల మెయిన్ ప్లస్ పాయింట్స్ ఇవే చెప్పవచ్చు.

అవి ఏవంటే, పవన్ కళ్యాణ్ ఊర మాస్ లుక్, ఆయన పలికిన పవర్ఫుల్ డైలాగ్స్, స్టైల్, ఫైట్స్ తో పాటు ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు, హీరోయిన్ శృతి హాసన్ అందంతో పాటు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెయిన్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఇక నిన్నటితో ఈ సినిమా సక్సెస్ఫుల్ గా 9 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కాగా అతి త్వరలో మరొక్కసారి పవన్, హరీష్ శంకర్ ల కాంబోలో ఒక సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే... !!

మరింత సమాచారం తెలుసుకోండి: