తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ కి ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప'. కొవిడ్ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా ఆపారు. పరిస్థితులు కాస్త చక్కబడ్డట్టు అనిపించగానే షూటింగ్‌ను పునః ప్రారంభిస్తారు. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని బన్ని, సుక్కు, నిర్మాతలు అనుకుంటున్నారట.

ఈ సినిమాను ఆగస్టు 13న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ అల్లు అర్జున్ కి కరోనా రావడంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు సినిమా విడుదల వెనక్కి వెళుతుందని అంటున్నారు. శేషాచల అడవుల్లో సాగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్‌గానే విడుదలైన 'పుష్ప' క్యారెక్టర్‌ రివీలింగ్‌ టీజర్‌ సోషల్‌ మీడియాలో దూసుకెళ్తోంది. ఈ టీజర్‌కు ఇప్పటికే అరవై మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ వచ్చాయి. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక పుష్ప చిత్రం రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల మందుకు రానున్న‌ట్టు కొన్నాళ్లుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఈ విష‌యాన్ని చిత్రనిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ క‌న్‌ఫాం చేశారు. పుష్ప చిత్రాన్ని రెండున్న‌ర గంట‌ల‌లో చెప్ప‌లేం. అందుకే అల్లు అర్జున్, ద‌ర్శ‌కుడు, సుకుమార్ మేం అంద‌రం క‌లిసి రెండు భాగాలుగా తీయాల‌ని అనుకున్నాం. తొలి పార్ట్ షూటింగ్ పూర్తి కాగానే రెండో పార్ట్ షూటింగ్ శ‌ర‌వేగంగా చేస్తాం. ఇప్ప‌టికే రెండో భాగం షూటింగ్ ప‌ది శాతం పూర్తైంది అని ర‌వి శంక‌ర్ అన్నారు. ఏదేమైన బాహుబ‌లి త‌ర్వాత పుష్ప చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల కానుండ‌డం ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: