ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య పోటీ ఎక్కువగా ఉంది  యువ హీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా ఎక్కువగానే ఉన్నారు ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని ఫ్యామిలీల నుంచి కొత్త హీరోలు వస్తూనే ఉంటారు.  అయితే ఇక ఒక ఫ్యామిలీకి చెందిన హీరో లకు సంబంధించిన సినిమాలు వచ్చాయి అంటే చాలు అటు ప్రేక్షకులందరూ మురిసిపోయి సినిమాలు చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది రియల్ లైఫ్ రిలేషన్స్ ఉన్న హీరోలు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి హీరోలలో అల్లు బ్రదర్స్ కూడా ఉన్నారు.


 మొదట అల్లు అర్జున్ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే గంగోత్రి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అర్జున్ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఊహించని విధంగా క్రేజ్ సంపాదించాడు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతూ దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్.  మెగా కాంపౌండ్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయినప్పటికీ ఇప్పుడు మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.



 అయితే అల్లు అర్జున్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా కొనసాగుతున్న సమయంలోనే అతని తమ్ముడు ఏకంగా మెగా బ్యాక్ గ్రౌండ్ తో అల్లుఅర్జున్ తమ్ముడిగా కూడా ఎంట్రీ ఇచ్చినా ఎక్కడ రాణించలేక పోతున్నాడు ఇప్పటివరకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసినా స్టార్ డమ్ కాదు కదా సరైన విజయాలు కూడా సాధించలేక పోతున్నాడు అల్లు శిరీష్. అయితే చూడటానికి అల్లు అర్జున్ అల్లు శిరీష్ ఒకే పోలికతో ఉంటారు కొన్ని కొన్ని సార్లు  శిరీష్ ని చూసి అల్లు అర్జున్ అని అనుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. ఇలా అన్నదమ్ములు ఇద్దరూ ఒకే పోలికలతో ఉన్నప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రం అన్న సూపర్ హిట్ అయితే తమ్ముడు మాత్రం పూర్తిగా ఫట్ అయిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: