సినీ ఇండస్ట్రీలో సింగర్ సునీత తన పాటలతో అందరినీ అలరించింది. ఆమె అందానికి పలు సినిమా అవకాశాలు వచ్చినా, ఆమె సున్నితంగా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేసింది. ఒకవైపు సింగర్ గానే కాకుండా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బిజీగానే ఉంటూ సునీత యాంకరింగ్ చేయడం విశేషం. తన చిన్న వయసులోనే సంగీతంలో శిక్షణ తీసుకునే సమయంలో గులాబీ సినిమా లో సాంగ్ ద్వారా గాయనిగా కెరీర్ మొదలు పెట్టింది.


అయితే సునీత పాడిన పాటలకు ఎంతోమంది  ఫిదా అయిపోయారు. అందుచేతనే ఆమెకి వీరాభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు అని కూడా చెప్పవచ్చు. ఇక తెలుగులో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు హీరోయిన్లకు సునీత డబ్బింగ్ చెప్పడం గమనార్హం. అయితే ఆ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


సునీత  దాదాపు 500 సినిమాలలో డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేశారు. తెలుగులో ఎంతో మంచి నటులు గా పేరు పొందిన శ్రీయ, తమన్నా, అనుష్క, మీరా జాస్మిన్, సౌందర్య, జెనీలియా వంటి హీరోయిన్ల కే కాకుండా మరికొంతమంది హీరోయిన్లకు  కూడా సునీత డబ్బింగ్ చెప్పారట. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో సైతం సునీత సింగర్ గా సత్తా చాటారు.19 సంవత్సరాల వయసులోనే కిరణ్  కుమార్ గోపరాజు తో  సునీత వివాహం జరగగా, కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఈ సంవత్సరం జనవరి నెలలో సునీత, హైదరాబాద్ లోని అతి పెద్ద వ్యాపారవేత్త అయిన రామ్ వీరపనేని ని వివాహం చేసుకొని, ఆనంద జీవితాన్ని గడుపుతున్నారు.

వీరిద్దరికీ  రెండో వివాహం కావడం గమనార్హం. కరోనా కారణం చేత వీరిద్దరూ ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. ఏది ఏమైనా ఒక సింగర్ ఇంత మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పడం ఒక విశేషం.
సునీత ఒకవైపు సింగర్ గా , మరొకవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, మరొకవైపు మంచి గృహిణిగా తన సత్తా ఏంటో చూపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: