సాధారణంగా హీరోల తముళ్లు హీరోలు అవడం సాధారమే కానీ హీరోయిన్ ల చెల్లెళ్ళు హీరోయిన్లు అవ్వడం అనేది తక్కువే అని చెప్పాలి. అలా ఒకే కుటుంబం నుండి వచ్చి హీరోయిన్ లుగా మెరిసిన అక్కా చెల్లెళ్ళ గురించి ఇప్పుడు చూద్దాం. అందాలతార కాజల్ అగర్వాల్ తో పాటు ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ సైతం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. నిషా తెలుగు తో పాటు తమిళ భాషల్లో నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా సుకుమారుడు సినిమాతో నిషా అగర్వాల్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కాజల్ స్టార్ హీరోయిన్  ల లిస్ట్ లో చేరగా నిషా మాత్రం ఆ రేంజ్ కు వెళ్లలేకపోయింది. అంతే కాకుండా ఈ అమ్మడు అక్క కాజల్ కంటే ముందే ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లాడి సినిమాలకు దూరం అయ్యింది. నిషా అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. 

అంతే కాకుండా నిషా మళ్లీ రీఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చినా ఇప్పటి వరకు ఏ సినిమా చేయలేదు. అంతే కాకుండా కమల్ హాసన్ ఇద్దరు కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో అక్క శృతి హాసన్ స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళిపోయింది. తమిళ, తెలుగు భాషల్లోనే కాకుండా హిందీలోనూ అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ బిజీగా వుంది. అయితే శ్రుతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ మాత్రం ఇంకా అవకాశాల కోసం సతమతమవుతూనే ఉంది. సమితాబ్, వివేగం లాంటి సినిమాల్లో నటించిన అక్షర ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది. మొదట్లో శృతి హాసన్ కూడా సక్సెస్ కోసం పరితపించినా ఆ తరవాత స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. మరి అక్షర కూడా అక్కలా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: