కరోనా మహమ్మారి వల్ల వృద్ధులే కాకుండా యుక్త వయసు లో ఉన్న వారు కూడా చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం.. వీరిలో ప్రముఖులు కూడా ఉన్నారు.. టాలీవుడ్ లో మంచి జర్నలిస్ట్ అయినా టీఎన్ఆర్ ఇటీవల కరోనా సమస్యతో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.. ఎన్నో మంచి ఇంటర్వ్యూ లతో ప్రేక్షకుల ను ఆకట్టుకున్న టి ఎన్ ఆర్ ఇలా అర్ధాంతరంగా చనిపోవడం ఆయన అభిమానులను నిరాశ పరిచింది..

ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ లో వచ్చే ఫ్రాంక్లీ విత్ టి ఎన్ ఆర్ అనే షో ద్వారా ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకోవడం తో పాటు మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు టి ఎన్ ఆర్ .. యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన గంటల తరబడి సూటిగా సుత్తి లేకుండా సహజమైన ప్రశ్నలు వేస్తూ తనదైన శైలిలో ఇంటర్వ్యు తో ప్రేక్షకులను అలరించాడు.. యాంకర్ అంటే ఇలా ఉండాలి అనే లాగా ప్రశ్నలు సంధిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు..

ఈయన చేసే ఇంటర్వ్యూలు ఏ సమయంలోను బోర్ కొట్టకుండా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అలా ప్రస్తుత డిజిటల్ తెలుగు మీడియా రంగం లో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్లలో ఆయన కూడా ఒకరయ్యారు. రాం గోపాల్ వర్మ, తేజ స్టార్ డైరెక్టర్ లని ఇంటర్వ్యూ చేసే సెన్సేషనల్ అయ్యారు.. కృష్ణవంశీ, తనికెళ్ల భరణి వంటి వారిని నాలుగు గంటల పైగా ఇంటర్వ్యూ చేసి రికార్డు కూడా క్రియేట్ చేశారు..  అంతటి ప్రత్యేకత చాటుకున్న టీ ఎన్ ఆర్ ఒక్కో షో కి  దాదాపు లక్ష రూపాయల పారితోషికం తీసుకునే వారని సమాచారం.. ఇంటర్వ్యూల లోనే కాకుండా ఆయన కొన్ని సినిమాల్లో కూడా కనిపించారు.. ఏదేమైనా ఓ గొప్ప జర్నలిస్టు ను టాలీవుడ్ కోల్పోవడం చాలా బాధాకరం..

మరింత సమాచారం తెలుసుకోండి: