తమ అద్భుతమైన నటనతో కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అభిమానుల అశేషమైన ఆదరణ సంపాదించుకున్న రజనీకాంత్, ధనుష్ మామ అల్లుళ్ళవుతారని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రముఖ కోలీవుడ్ నిర్మాత, దర్శకుడు కస్తూరి రాజా కుమారుడైన ధనుష్ అసలు పేరు వెంకట్ ప్రభు కాగా అతను 23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలని తన పదహారేళ్ల వయసులోనే నిశ్చయించుకున్నారట. ధనుష్ కి విమలగీత, కార్తీక అనే ఇద్దరు అక్కలు ఉన్నారు.. వారిలో ఒకరు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కి మంచి స్నేహితురాలు.


ధనుష్ అన్నయ్య సెల్వరాఘవన్ విభిన్న చిత్రాలను రూపొందిస్తూ గొప్ప డైరెక్టర్ గా పేరు పొందారు. అప్పట్లో ధనుష్ తన అన్నయ్య దర్శకత్వంలో కాదల్ కొండెయిన్(2003) సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా స్పెషల్ షో చూసేందుకు ఐశ్వర్య ఆల్బర్ట్ థియేటర్ కి వచ్చారు. అదే థియేటర్ లో ధనుష్ కూడా ఉన్నారు. అయితే ఈ సినిమాలో ధనుష్ కనబరిచిన అద్భుతమైన నటనకు ఐశ్వర్య ఫిదా అయిపోయారు. మరుసటి రోజు ఫ్లవర్ బొకే పంపించి మీ నటన చాలా అద్భుతంగా ఉందని ఒక లేఖ ద్వారా తెలియజేశారు. దీంతో ధనుష్ ఐశ్వర్యకి ఫోన్ చేసి థాంక్స్ చెప్పారు. ఆ రోజు నుంచి వారి మధ్య బంధం బలపడింది. వీరిద్దరూ కలసి బయట కనిపిస్తుండటంతో అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. కాగా, ఐశ్వర్య తన చెల్లెలికి కేవలం స్నేహితురాలు మాత్రమేనని ధనుష్ రూమర్స్ ని కొట్టి పారేశారు.



అయితే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్ట పడుతున్న విషయం పెద్దల వరకు వెళ్ళింది. దీనితో ఇరువురి కుటుంబ పెద్దలు మాట్లాడుకుని ధనుష్, ఐశ్వర్య లకు పెళ్లి చేశారు. అప్పటికి అతని వయసు 21 కాగా ఐశ్వర్య వయసు 23 ఏళ్లు. నటన పట్ల ఎంతో అంకితభావంతో పనిచేసే ధనుష్ అంటే రజనీకాంత్ కి అంటే చాలా ఇష్టం. వరసకి అల్లుడే అయినప్పటికీ ధనుష్ ని తన సొంత కుమారుడిలాగా చాలా ప్రేమగా చూసుకుంటారు. ధనుష్ కూడా రజనీకాంత్ కి చాలా గౌరవం ఇస్తుంటారు.




ధనుష్ చాలా సినిమాల్లో తన మామయ్య స్టైల్ ని కాపీ కొట్టారు. కానీ 'అందరూ రజనీకాంత్ కాలేరు. ఆయనకు ఆయనే సాటి. ఆయన నాకు మామ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది' అని పలు సినిమా ఈవెంట్స్ లో చెబుతూ తన మామయ్యపై తనకున్న ప్రేమను ధనుష్ చాటుకున్నారు. రజనీ-ధనుష్ మధ్య గాఢానుబంధం ఉంటుందని సన్నిహితులు చెబుతుంటారు. రజనీకాంత్ నటించిన కుసేలాన్ చిత్రంలో ధనుష్ ఒక చిన్న పాత్ర చేశారు కానీ తన మామయ్య తో కలిసి ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేయలేదు. ఈ మామ అల్లుళ్ళ కాంబోలో ఒక సినిమా రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి అది నిజం అవుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: