నందమూరి కుటుంబం అంటే ఇప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఈ గుర్తింపు ఊరికే రాలేదు. దీని వెనుక పెద్దాయన శ్రమ, అకుంఠిత దీక్ష, పని పట్ల అంకిత భావం ఇవన్నీ ఒక వంశం యొక్క గౌరవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి. నందమూరి కుటుంబం నుండి ప్రతి తరంలో ఎవరో ఒకరు తెలుగు ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు. ప్రజలు అందరినీ ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. నందమూరి తారక రామారావు తర్వాత బాలకృష్ణ ఆ పేరును సార్ధకం చేసుకున్నాడు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.  అయితే బాలకృష్ణకు వయస్సు పైబడతుండడంతో, తరువాత నందమూరి ఫ్యామిలీ నుండి ఎవరు వారి పేరును నిలబెడతారో అనే ప్రశ్నకు సరైన సమాధానం జూనియర్ ఎన్టీఆర్. 

కానీ ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఇద్దరూ హీరోలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. కానీ ఎన్టీఆర్ మంచి సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోలలో చోటు దక్కించుకోగా, కళ్యాణ్ రామ్ మాత్రం అడపా దడపా సినిమాలను చేస్తూ, అవి కూడా మంచి ఫలితాలను ఇవ్వకపోవడంతో కెరీర్ లో ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడని చెప్పాలి. అయితే ఇందుకు ఎన్నో కారణాలున్నా... సినిమా వర్గాల సమాచారం ప్రకారం సినిమాల ఎంపికలో తప్పులు దొర్లుతున్నాయని చెప్పుకుంటూ ఉన్నారు. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పటాస్ తర్వాత ఆ స్థాయి హిట్ లేదని చెప్పాలి. దీనితో కళ్యాణ్ రామ్ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. 

ఇక ముందైనా సినిమాలను ఎంచుకునే సమయంలో ఆచితూచి అడుగులు వేస్తే మరి కొంతకాలం సినిమా పరిశ్రమలో హీరోగా కొనసాగవచ్చు. లేదంటే తనకెలాగూ నిర్మాణ సంస్థ ఉంది కాబట్టి సినిమాలను నిర్మించుకునే పనిలో బిజీగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో లవకుశ సినిమాను తన బ్యానర్ లోనే తెరకెక్కించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కున్న క్రేజ్ మూలాన అందరూ పెద్ద డైరెక్టర్స్ తనతో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. కాబట్టి సినిమా ప్లాప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. పైగా ఎన్టీఆర్ సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: