ఈ రోజు నెపోటిజం అనే విషయం వెలుగులోకి వచ్చింది కానీ, చాలా కాలంగా సినిమా రంగంలో దర్శకనిర్మాత, నటీనటుల వారసులు ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అవుతున్నారు. టాలీవుడ్ లో ఒకే కుటుంబం నుంచి నటీనటులు పరిచయమయ్యారు.  కానీ వాళ్ళ మధ్య వున్న బంధుత్వాల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియదనే చెప్పాలి. టాలీవుడ్ లో కొందరు సినీ ప్రముఖుల బంధుత్వాల గురించి తెలుసుకుందాం. 

 

సావిత్రి,  హీరోయిన్ రేఖ 

అలనాటి మహానటి సావిత్రి, ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ రేఖ ఇద్దరు తల్లీ కూతుళ్లు అవుతారు. సావిత్రిని రెండో పెళ్లి చేసుకున్న జెమినీ గణేషన్ మొదటి భార్య పుష్పవల్లి కూతురు రేఖ. 

 

గోపీచంద్, శ్రీకాంత్ 

హీరో గోపీచంద్, శ్రీకాంత్ కి బంధువేనన్న సంగతి చాలామందికి తెలియదు. గోపీచంద్ శ్రీకాంత్ మేనకోడలిని పెళ్ళి చేసుకున్నాడు. 

 

కమల్ హాసన్ - మణిరత్నం 

విశ్వ నటుడు కమల్ హాసన్, సహజ నటి సుహాసినికి స్వయానా బాబాయ్ అవుతారు. కమల్ అన్నయ్య చారు హాసన్ కూతురు సుహాసిని. లెజెండ్ డైరెక్టర్ మణిరత్నంని 1988లో ఆమె పెళ్లి చేసుకున్నారు. 

 

కె విశ్వనాథ్, చంద్రమోహన్

కళాతపస్వి కె విశ్వనాథ్, నటుడు చంద్రమోహన్ వరుసకు అన్నదమ్ములు అవుతారు. అందుకే తన సినిమాల్లో చంద్రమోహన్ ని విశ్వనాధ్ ఎక్కువగా ప్రోత్సాహించేవారు. 


విజయ నిర్మల, జయసుధ 

ఇక టాలీవుడ్ లేడీ డైరెక్టర్ విజయ నిర్మల, సహజనటి జయసుధకు అత్తవుతుంది. అందుకే కృష్ణ సినిమాతోనే జయసుధ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

 

ఏ ఆర్ రెహమాన్, జి వి ప్రకాష్  

మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్, జి వి ప్రకాష్ ల మధ్య కూడా బంధుత్వం ఉంది. సంగీత దర్శకునిగా పరిచయమై, హీరోగా మారిన ప్రకాష్, స్వయంగా రెహ్మాన్ సొంత అక్క కొడుకే. అయితే వాళ్ళు మతం మార్చుకోలేదు. 

 

అరుణ్ విజయ్ -  విజయ్ చందర్ 

‘సాహో’ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో నటించిన అరుణ్ విజయ్ ఎవరంటే, ప్రముఖ నటుడు విజయ్ చందర్ మొదటి భార్య కొడుకు. మొదటి భార్య చనిపోయాక మంజులను పెళ్లాడారు. టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలలో నటించిన స్టార్ హీరోయిన్లు ప్రీతి, వనిత , శ్రీదేవి వీరి సంతానమే. 

 

రామ్, శర్వానంద్ 

హీరో రామ్, శర్వానంద్ ఇద్దరు  దగ్గరి బంధువులు అన్న సంగతి చాలా మందికి తెలియదు. రామ్ పోతినేనికి శర్వానంద్ బావ వరస అవుతాడు. శర్వానంద్ అన్న రామ్ పోతినేని అక్క ఇద్దరు భార్యాభర్తలు.  

 

ప్రకాష్ రాజ్, శ్రీహరి

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, శ్రీహరి ఇద్దరూ బంధువులేనన్న సంగతి చాలా మందికి తెలియదు. ప్రకాష్ రాజ్ మొదటి భార్య, శ్రీ హరి భార్య సొంత అక్క చెల్లెళ్లు. 

  

కొరటాల శివ పోసాని

హిట్ల మీద హిట్లు కొడుతున్న కొరటాల శివ తెలుగు సినిమాలో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. అలాగే దర్శకుడిగా, నటుడిగా తనదైన శైలిలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పోసాని కృష్ణ మురళికి కొరటాల శివ మేనల్లుడు అవుతారు.  

 

చోటా కె నాయుడు, సందీప్ కిషన్

కెమెరామెన్ చోటా కె నాయుడికి యువ హీరో సందీప్ కిషన్ మేనల్లుడు అవుతాడు. సందీప్ హీరోగా నటించిన చాలా సినిమాలకు చోటా కె నాయుడు కెమెరా మెన్ గా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: