దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. దీంతో ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారడం తో పాటు చివరికి చనిపోవడం కూడా జరుగుతోంది. కొంతమందికి బెడ్స్ అందక, మరికొంతమంది ఆక్సిజన్ సరిగా అందక కన్నుమూస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పట్ల అవగాహన నెలకొల్పుతూ తమ వంతు సహాయంగా కొంత మంది సెలబ్రిటీలు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అలాంటి వారిలో తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ముందుకు వచ్చింది.


కరోనా కష్టకాలంలో ఉన్న వారు తమ కి మెసేజ్ చేస్తే, సహాయం చేసేందుకు రెడీగా ఉన్నాం అంటూ లైవ్ వీడియో ద్వారా ఆమె సందేశం ఇచ్చింది. ప్లాస్మా, ఆక్సిజన్, మెడిసిన్ వంటివి అవసరం ఉన్న వారు మెసేజ్ చేయండని, ఆ మెసేజ్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అందరికీ అవసరమయ్యే సాయం అందేలా కృషి చేస్తానని ఆమె చెప్పింది. లాక్ డౌన్ ఉన్నందువలన అందరూ ఇళ్లల్లోనే ఉండాలి అని కూడా చెప్పింది.


కరోనాను  నియంత్రించేందుకు గవర్నమెంట్ తీసుకున్న చర్యలు సరిపోవడం లేదని అనిపించింది. అందువల్లే నేను ముందుకు వచ్చానని తెలిపింది. నిజంగా అవసరం ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. వైద్య సదుపాయాలకు సంబంధించి అన్ని రకాల సహాయం చేయడానికి నేను రెడీగా ఉన్నా కానీ... దయచేసి ఎవరు "డబ్బులు అడగవద్దని తెలిపింది. ప్లీజ్ అర్థం చేసుకోండి. అలా చాలాసార్లు మోసపోయాను. డొనేషన్ అంటూ చీట్ చేశారు". కాబట్టి ఎవరికైనా ప్లాస్మా,ఆక్సిజన్, బెడ్స్ లాంటి అవసరాల గురించి మాత్రమే అడగండి. అని చెప్పింది రేణు దేశాయ్.

రోజు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు చనిపోతుంటే చాలా బాధగా ఉంది. కాబట్టి అందరూ ఇళ్లల్లోనే ఉండండి. మనసుకు నచ్చిన పని చేయండి అంటూ రేణుదేశాయ్ చెప్పింది. అవసరం ఉన్నవారు తప్పకుండా మెసేజ్ చేయాలి అంటూ ఆమె విన్నవించుకుంది. కష్టకాలంలో కూడా ఇలాంటి ఎంతో మంది సెలబ్రిటీలు ప్రజలకు అండగా ఉండడం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: