సంపూర్నేష్ బాబు, తెలుగులో హృదయ కాలేయం అనే సెటైరిక్ సినిమాతో పరిచయం అయ్యాడు. ఆయన మీద రకరకాల జోకులు, మీమ్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ఎన్నయినా సరే టాలీవుడ్ మొత్తానికి ఆయన ఇప్పుడు రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే చిన్నవాడే అయినా అవసరమైనప్పుడు ప్రజలకు సేవ చేయడానికి సంపూ ముందు వరుసలో ఉంటారు. చాలా సందర్భాల్లో, ఆయన పెద్ద హీరోలకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే, ఇటీవలి కాలంలో ప్రతి సంక్షోభ పరిస్థితుల్లోనూ టాలీవుడ్ నుంచి ముందుగా నిలుస్తున్న వ్యక్తి ఎవరయినా ఉన్నారా ? అంటే అది సంపూర్నేష్ బాబు అని చెప్పక తప్పదు. 


తాజాగా కరోనా కారణంగా ప్రముఖ సినీ జర్నలిస్ట్ మరియు నటుడు టిఎన్ఆర్ కొన్ని రోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కుటుంబానికి సంపూర్నేష్ బాబు 50000 సాయం అందించారు. చిరంజీవి సైతం ఒక లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి, అయినా సరే తన స్థాయికి మించి యాభై వేల రూపాయలు ఇచ్చి సంపూర్నేష్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా నిలిచింది. ఇక సంపూర్నేష్ ఇలా చాలా సందర్భాల్లో ఆయన మద్దతు అందిస్తూ వస్తున్నారు. 


గత ఏడాది కోవిడ్ -19 రిలీఫ్ ఫండ్ కోసం ఆయన లక్ష రూపాయలు ఇచ్చారు. అతను తెలంగాణకు చెందిన వారు అయినప్పటికీ, ఇతర రాష్ట్రాల ప్రజలకు రూ. 2 లక్షలు, కర్ణాటక వరద సహాయనిధికి 2019 లో రూ. 50,000, 2018 లో శ్రీకాకుళం వరద సహాయనిధికి అలాగే గతేడాది హైదరాబాద్ వరద సహాయనిధికి 50,000 రూపాయలు   సంపూర్నేష్ బాబు అందించారు. ఇలాంటి సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి. సంపూర్ణేష్ బాబు సిద్దిపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిట్టపల్లి అనే గ్రామానికి చెందినవాడు. ఇక ఆయన సాధారణ కంసాలి కుటుంబానికి చెందినవాడు. ఆయన తన గ్రామంలోనే ఉంటాడు, కేవలం షూటింగ్ సమయంలో మాత్రమే హైదరాబాద్‌లో ఉండటానికి ఇష్టపడతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: