సూపర్ స్టార్ కృష్ణ నటవారసులలో ఆయన కుమార్తె మంజుల ఘట్టమనేని కూడా ఉన్నారు. 1998లో విడుదలైన మలయాళ చిత్రం సమ్మర్ ఇన్ బెత్లెహాం మూవీలో లీడ్ హీరోయిన్స్ లో ఒకరిగా మంజుల నటించారు. ఆ తరువాత రాజస్థాన్ అనే ఓ చిత్రంలో టెర్రరిస్ట్ గా క్యామియో రోల్ చేయడం జరిగింది. 2002లో షో అనే చిత్రాన్ని నిర్మించి నటించారు. ఆ మూవీ జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కించుకోవడం విశేషం.మంచి నిర్మాతగా మరియు మహేష్ బాబు అక్కగా మంజుల గారికి మంచి పేరు ఉంది. అయితే అప్పట్లో మంజుల హీరోయిన్ గా చేయడం, కృష్ణ ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు.దానికి కారణం వారి అభిమాన నటుడి కూతురు హీరోయిన్ గా గ్లామర్ పాత్రలు చేయడం వారు ఓర్చుకోలేకపోయారు. 

ఈ విషయంపై అప్పట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. మంజుల గారికి మొదటినుంచి నటన అంటే చాలా ఇష్టం అయితే ఆమెకి మొదటిసారి అప్పట్లో వచ్చిన బాలకృష్ణ టాప్ హీరో సినిమాలో హీరోయిన్ గా ఆమెకి ఛాన్స్ వచ్చింది. మంజుల గారు ఒప్పుకొని సినిమా మొదలయ్యే సమయానికి కృష్ణ గారి అభిమానులు ఆమెని సినిమాలు చేయొద్దు అని ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. సినిమా ఆఫీసుల దగ్గరికి వెళ్లి పెట్రోల్ తో నిప్పు అంటించుకుంటాం అని బెదిరించడం లాంటివి చాలా చేశారు. అయితే వీటి వలన మంజుల గారి హీరోయిన్ గా చేసే ఆలోచనని విరమించుకొని ఆ సినిమా నుంచి తప్పుకున్నారు.ఆ సమయంలో ఆమెకి మహేష్ బాబు చాలా సపోర్ట్ ఇచ్చారట.

  ఇక అభిమానుల కోరిక మేరకు మంజుల సినిమా పై ప్రేమ వదులుకోలేక నిర్మాతగా మారారు. మహేష్ నటించిన నాని, పోకిరి చిత్రాలను మంజుల నిర్మించడం జరిగింది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మనసుకు నచ్చింది చిత్రానికి మంజుల దర్శకత్వం వహించడం విశేషం. అయితే ఆమెలో ఇంకా నటన మీద కోరిక ఉండి సినిమాల్లో కొన్ని చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: