గాన గంధర్వుడు ఎస్పీ బాలూ కెరీర్ సుదీర్ఘమైనది. ఆయన నలభై వేలకు పై చిలుకు పాటలు పాడారు. ఆయన తన గొంతుని అరువిచ్చి ఎందరినో స్టార్లుగా, సూపర్ స్టార్లుగా చేశారు. ఇక టాలీవుడ్ లో బాలూ ఎదుగుదల ఒక క్రమ పద్ధతిలో సాగింది.
 
ఆయన కొత్తగా ఇండస్ట్రీలో ప్రవేశించేనాటికే నాటికి ఘంటసాల వంటి ఉద్ధండుడు ఉన్నారు. ఆయనే ఎన్టీయార్, ఏయన్నార్ వంటి సీనియర్లకు పాడేవారు. ఇక అప్పటికే ఇండస్ట్రీకి వచ్చిన క్రిష్ణ, శోభన్ బాబులకు కూడా ఘంటసాల పాడేవారు. మరి జూనియర్ సింగర్ అయిన బాలూకు ఎవరు అవకాశాలు ఇస్తారు, ఎవరు పాడించుకుంటారు. అయినా మొక్కవోని ధైర్యంతో బాలూ  తన సినీ కెరీర్ ని మొదలెట్టారు.

ఆయన మొదట హాస్యనటులకే గాత్రధారణ చేసేవారు. ఆ తరువాత క్రిష్ణ బాలూని ప్రోత్సహించారు. దాంతో బాలూ గాయకుడిగా స్థిరపడ్డారు. అడపాతడపా మిగిలిన వారికి పాడుతున్నా ఏయన్నార్ కి మాత్రం బాలూ పాడలేదు. దానికి ఒక కారణం ఉంది. బాలూ వచ్చిన కొత్తల్లో ఏయన్నార్ కి ఇద్దరు అమ్మాయిలు సినిమాలో ఒక సాంగ్ పాడారు.  అప్పటికి ఆయనది లేత గొంతు కావడంతో సూట్ కాలేదు. దాంతో ఏయన్నార్ కి బాలూ వాయిస్ సెట్ అవదు అన్న ముద్ర పడిపోయింది.

ఇదిలా ఉంటే బాలూ బాగా బిజీ అయ్యాక ఎన్టీయార్ తో పాటు అందరికీ పాడుతున్నా కూడా ఏయన్నార్ కి మాత్రం పాడలేకపోయారు. ఆ ముచ్చట తీర్చేందుకు బాపూ పూనుకున్నారట. ఆయన అందాల రాముడు మూవీలో ఏయన్నార్ హీరో. ఆ మూవీలో మొత్తం పాటలు పాడేందుకు బాలూకి చాన్స్ ఇచ్చారు. దాంతో బాలూ ఎగిరి గంతేశారు. అయితే అదే సమయంలో బాలూకి ఫస్ట్ టైమ్ అమెరికా టూర్ చేసే చాన్స్ వచ్చింది. దాంతో ఆయన ఎటూ తేల్చుకోలేకపోయారట. మొత్తానికి ఆయన అమెరికా టూర్ వెళ్ళడమే ఖరారు అయింది. అలా అందాల రాముడు మూవీలో  అక్కినేనికి పాటలు పాడే చాన్స్ తృటిలో తప్పిపోయిందని చెబుతారు. ఆ తరువాత ఆయన రాజా రమేష్ మూవీతో టోటల్ సాంగ్స్ అక్కినేనికి పాడడం మొదలెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: