ప్రేమకి కళ్లులేవు, చెవులు లేవు అన్నట్లు వయసుతో కూడా పనిలేదు.. ఎవరికీ ఎవరిపట్ల ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రేమ పుడుతుందో చెప్పలేం.. ముఖ్యంగా మన సెలెబ్రిటీలు ప్రేమ విషయంలో పెద్దగా ఆలోచించారు.. పెళ్ళైనా, కాకపోయినా వారికి నచ్చితే చాలు యిట్టె ప్రేమలో పడి వారిని పెళ్ళికి ఒప్పిస్తారు.. చాలామంది సెలెబ్రిటీలు రెండు కి పైగా పెళ్లిళ్లు చేసుకున్నవారు ఉన్నారంటే వారికి ప్రేమ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఇకపోతే ప్రేమకు వయసు తో పనిలేదు అని నిరూపించిన జంటలను ఇప్పుడు మనం చూద్దాం..

చాలామంది మన హీరోలు తమకంటే పెద్దవారైనా భార్యలను పెళ్ళిచేసుకుని ఓ కొత్త సంస్కృతి కి పునాది వేశారు. ఐశ్వర్యా రాయ్‌, అభిషేక్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, ప్రియాంక, బిపాసా బసు వంటి తారలు నిజజీవితంలో ప్రేమకు వయసుకు సంబంధం లేదు అని నిరూపించారు. ప్రస్తుతం ఎంతో సాఫీగా హాయిగా వారి ప్రేమ వివాహాలు కొనసాగుతుండగా వారి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో ఇప్పుడు చూద్దాం.. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్‌.. భర్త అభిషేక్‌ బచ్చన్‌ని పెళ్లి చేసుకుంది. ఆమె ఏజ్‌ 34, ఆయన ఏజ్‌ 32. అంటే రెండేళ్లు చిన్న.

సైఫ్‌ అలీ ఖాన్‌ మొదట అమృతా సింగ్‌ని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమె వయసు 35ఏళ్లు. సైఫ్‌ ఏజ్‌ 21. అంటే దాదాపు 14ఏళ్లు డిఫరెన్స్ ఉంది. తర్వాత వీరిద్దరు విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సైఫ్‌.. కరీనాని లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు.హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ని ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో ప్రియాంక ఏజ్‌ 36ఏళ్లు, నిక్‌ జోనాస్‌కి 26 ఏళ్లు. పదేళ్లు తనకంటే చిన్న.బిపాసా బసు తనకంటే మూడేళ్లు చిన్నవాడైన కరణ్‌ గ్రోవర్‌ని పెళ్ళి చేసుకుంది. ఆయనకు 33ఏళ్లు అయితే, బిపాసాకి 36ఏళ్లు.అర్జున్‌ రాంపాల్‌ తనకంటే ఆరేళ్లు ఎక్కువ వయసున్న మెహర్‌ని లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. కానీ మ్యారేజ్‌ లైఫ్‌కి ఏజ్‌ బారియర్‌ కాదని నిరూపించారు.రజనీ కూతురు ఐశ్వర్యా రజనీకాంత్‌.. ధనుష్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ధనుష్‌ ఆమె కంటే రెండేళ్లు చిన్న.


మరింత సమాచారం తెలుసుకోండి: