టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా సక్సెస్ లతో కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తుండగా చరణ్ అల్లూరిసీతారామ రాజు గా కనిపించనున్నారు. 1920 సమయంలో జరిగిన వాస్తవ కథకి కొంత ఫిక్షన్ అంశాలు కలగలిపి రాజమౌళిసినిమా తీస్తున్నట్లు సమాచారం. ఈ మూవీపై తెలుగు తో పాటు పలు ఇతర భాషల ఆడియన్స్ లో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి.

పాన్ ఇండియా మూవీగా భారీ ఖర్చుతో ఈ సినిమాని డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకి సంబంధించి ఇటీవల యూట్యూబ్ లో విడుదలైన ఎన్టీఆర్, చరణ్ ల ఫస్ట్ లుక్ టీజర్స్ రెండూ ఆడియన్స్ ని అలరించాయి. కాగా ఈ సినిమాని అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. అసలు విషయం ఏమిటంటే ఇటీవల కరోనా బారిన పడ్డ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మెల్లగా మెరుగుపడుతోందని, ఎవరూ ఆందోళన చెందవద్దని మొన్న తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పోస్ట్ చేసిన ఎన్టీఆర్, నేడు డెడ్ లైన్ అనే జాతీయ పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఈ సమయం మన అందరికీ ఒకరకంగా అగ్ని పరీక్ష వంటిదని, అందరం జాగ్రత్తగా ఇళ్ల దగ్గరే ఉండి సోషల్ డిస్టెన్స్ పాటిస్తే ఈ మహమ్మారిని తరిమికొట్టవచ్చని అన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ గురించి ఇప్పటిరకు బయటకు తెలియని ఏదైనా కొత్త విషయం మాకు చెప్తారా అంటూ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానమిస్తూ, ఈ సినిమా గురించి నేను ఏ విషయం బయటకు రివీల్ చేసినా సరే దర్శకుడు రాజమౌళి ఈ ఇంటర్వ్యూ చదివిన వెంటనే గొడ్డలి పట్టుకుని మా ఇంటికి రావడం ఖాయం అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు. అయితే సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ కి గూంజ్ బంప్స్ తెప్పించడం ఖాయం అని ఎన్టీఆర్ చెప్పడం జరిగింది .... !!

మరింత సమాచారం తెలుసుకోండి: