టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఇటీవలె క్రాక్ సినిమాతో భారీ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది..ఇక ఈ సినిమా హిట్ తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ.. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో రవితేజ  డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు.. ఇక ఇప్పటికే  మూవీ బిజినెస్.. ఓ రేంజ్ లో పలుకుతోంది.యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఖిలాడీ డిజిటల్ రైట్స్ కోసం..

ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చిందట. ఆ ఆఫర్ ఏంటి..? అనే వివరాల్లోకి వెళ్తే... కరోనా సమయంలోనూ క్రాక్ తో హిట్ కొట్టాడు.. రవితేజ. చాలాకాలం నుంచి హిట్లు లేక ఇబ్బంది పడుతున్న మాస్ మహారాజా.. క్రాక్ తో సంక్రాంతి సీజన్ లో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అదే ఊపులో ఉన్న రవితేజ.. రమేశ్ వర్మ డైరెక్షన్ లో ఖిలాడీ చేస్తున్నాడు. డ్యూయల్ రోల్ లో నటిస్తున్న రవితేజ ఖిలాడీపై..ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఖిలాడీ చిత్రంపై తాజాగా ఓ వార్త.. వైరల్ అవుతోంది. క్రాక్ మూవీ హిట్ కావడంతో పాటు.. ట్రైలర్ తో ఖిలాడీపై అంచనాలు పెరగడంతో.. ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.
 
అయితే అన్నింటికంటే ఎక్కువగా అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ. 45 కోట్లు ఆఫర్ చేసిందట. అయితే ఈ ఆఫర్ పై యూనిట్ ఇంతవరకు స్పందించలేదు కానీ.. మరోవైపు ఖిలాడీ మూవీ బడ్జెట్ పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఇటలీలో చివరి దశ షెడ్యూల్ ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా 15 రోజుల షూట్ తర్వాత.. ఇండియాకు తిరిగొచ్చిందట మూవీ యూనిట్. అయితే ఆ 15 రోజుల షూట్ కూడా సంతృప్తిగా లేకపోవడంతో.. పూర్తిగా మరోసారి రీ షూట్ చేయాల్సి వస్తుందట. దీంతో బడ్జెట్ పెరిగే అవకాశం ఉందని.. చెప్పుకుంటున్నారు. ఇటు ఈ మూవీ ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమాను వాయిదా వేశారు మేకర్స్...!!


మరింత సమాచారం తెలుసుకోండి: