ఈ ఏడాది ప్రారంభంలో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల సందడి బాగానే కనిపించింది. "ముఖ్యంగా " క్రాక్ " , మాస్టర్", వంటి సినిమాలు లాక్ డౌన్ తరువాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాల తరువాత " జాంబిరెడ్డి ", "ఉప్పెన" వంటి సినిమాలు కూడా మంచి విజయాలను నమోదు చేశాయి. ఇక ఏప్రెల్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ " వకీల్ సాబ్ " తో బాక్స్ ఆఫీస్ వద్ద తన మార్క్ మేనియా చూపించి కలెక్షన్ల వర్షం కురిపించాడు.

 ఇక ఈ సినిమా తరువాత టాలీవుడ్ పరిస్థితులు మారిపోయాయి. మళ్ళీ ఒక్కసారిగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ రూపంలో తీవ్రంగా విజృంభించడంతో విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ లిస్ట్ లో నాని " టక్ జగదీష్ ", రానా " విరాట పర్వం ", నాగ చైతన్య " లవ్ స్టోరీ ", మెగాస్టార్ " ఆచార్య ".. ఇలా క్రేజీ సినిమాలన్నీ కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. దాంతో మళ్ళీ టాలీవుడ్ కల తప్పింది. గత ఏడాది కరోనా కరణంగా తీవ్రంగా దెబ్బ తిన్న రంగాలలో సినీ పరిశ్రమ ముందు వరుసలో ఉంటుంది. అయితే గత ఏడాది థియేటర్ కు నోచుకోని చాలా సినిమాలు ఓ.టీ.టీ బాట పట్టాయి.

నాని నటించిన " వీ ", సూర్య నటించిన " ఆకాశమే నీ హద్దురా " సినిమాలు ఓ టీ టీ లో కూడా మంచి హైప్ తో రిలీజ్ అయ్యాయి. ఇక ఈ ఏడాది కూడా కరోనా తీవ్రత అధికంగానే ఉండడంతో సినిమాలు మళ్ళీ ఓ.టీ.టీ బాట పట్టడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రానా నటించిన " విరాటపర్వం " నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ఇదే కోవలో నాని " టక్ జగదీష్ ", నాగ చైతన్య " లవ్ స్టోరీ " సినిమాలకు అమెజాన్ ప్రైమ్ వారు రైట్స్ కోసం భారీ మొత్తం ఆఫర్ చేసేందుకు నిర్మాణ సంస్థలతో మంతనాలు జరుపుతున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: