నందమూరి బాలకృష్ణ తన తండ్రిపై ఉన్న ప్రేమను అవకాశం ఉన్న ప్రతి సారి చూపిస్తాడు అన్న విషయం తెలిసిందే.. చాలా ఈవెంట్స్ లో తన తండ్రి గురించి చెప్పి గానీ బాలకృష్ణ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడు.. తన తండ్రి గురించి ఎంత సేపైనా మాట్లాడగలిగే ప్రేమ బాలకృష్ణ కి ఉంది.. ఆవిధంగా తన ప్రేమను చూపిస్తాడు బాలకృష్ణ.. తండ్రి పై ఉన్న ప్రేమ కారణంగానే తండ్రి పేరుతో బయోపిక్ ని రెడీ చేసి రిలీజ్ చేశాడు.. ఫలితం ఎలా ఉన్నా ఎన్టీఆర్ పై సినిమా చేసి తండ్రి పై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నాడు...

మొత్తం రెండు పార్ట్ లు గా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించాడు మొదటి భాగంలో ఎన్టీఆర్ సినిమా లో సాధించిన విషయం గురించి రెండో పార్ట్ లో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి చూపించారు.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా నటించి తన ప్రేమనంత చూపించాడు బాలకృష్ణ.. ఓ తండ్రికి అసలు సిసలైన నివాళులు అర్పించిన బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ మాత్రం రానని మొండికేశాడట.. ఈ విషయాన్నీ నాదెండ్ల భాస్కర్ఓ సందర్భం లో వెల్లడించాడు..

ఎన్టీఆర్ గారు సన్నిహితులు కావడం వల్ల నాదెండ్ల తో ఎన్టీఆర్ బాలకృష్ణ చెన్నైలో ఎవరినో లవ్ చేస్తున్నాడు అంట ఎవరితోనో తిరుగుతున్నాడు అని నాకు తెలిసింది అని చెప్పి ఎలాగైనా బాలకృష్ణకు మనం పెళ్లి చేయాలి అని అనడంతో కాకినాడకి చెందిన నాదెళ్ల బంధువుల అమ్మాయి అయిన వసుంధర గారిని నాదెండ్ల గారే చూశారని చెప్పారు.మొదట ఈ సంబంధానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదని ఆ తర్వాత వసుంధర వాళ్ళ ఫ్యామిలీ ఎన్టీఆర్ కి 10 లక్షల రూపాయలు ఇవ్వడంతో పెళ్ళికి ఒప్పుకున్నాడని చెప్పాడు అయితే బాలకృష్ణ పెళ్లి రోజు నాదెండ్ల, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఒక మీటింగ్ లో ఉన్నారు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రజల్లో తన పైన బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని అనుకొని నాదెండ్ల తో చెప్పాడంట మనం ఇప్పుడు పెళ్లికిపోవడం లేదు ఇక్కడే ఉంటున్నామని దాంతో బాలకృష్ణ పెళ్లికి హాజరు కాలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: