ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలకు గతి ఏంటి అంటే ఓటీటీ మాత్రమే.. ఇప్పటికే చాలా టాలీవుడ్ సినిమాలు ఈ తరహా లో లో సినిమాలు విడుదల చేసుకుంటూ ఉంటే కొన్ని పెద్ద సినిమాలు మాత్రం ఇలా విడుదల చేయడానికి కొంత వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది.. దానికి కారణం ఏమిటో తెలియదు కానీ ఇలా సినిమా రిలీజ్ చేయడానికి వారు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు..  అలా ఓటిటీ లో రిలీజ్ చేయడానికి ఇష్టపడని నాలుగు సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది కానీ కరోనా నేపథ్యంలో థియేటర్లు క్లోజ్ చేయడంతో సినిమా అలా గే నిలిచిపోయింది.. అయితే ఈ సినిమా ఓ టి టి లలో రిలీజ్ చేయడానికి ఆ చిత్ర బృందం ఏ మాత్రం ఆసక్తి కనబరచడం లేదు దానికి కారణం నాని గత సినిమా ఇలానే రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యింది కాబట్టి.. అఖిల్ నటించిన మోస్ట్ వాంటె డ్ బ్యాచిలర్ రాణా విరాటపర్వం సినిమాలు  ఈ తరహా లో విడుదల చేయడానికి ఎక్కువ మక్కువ చూపించడం లేదు..

ఇక ‘నారప్ప, ‘అఖండ’, ‘లవ్‌స్టోరీ’, ‘ఖిలాడీ’, ‘నూటొక్క జిల్లాల్లో అందగాడు’, ‘పాగల్‌’ చిత్రాలను ఓటీటీ మాధ్యమంలో విడుదల చేయొచ్చు కానీ నిర్మాతలకు గిట్టుబాటు ధర రావడం లేదని, ఓటీటీ అయితే హీరో స్టార్‌డమ్‌కు తగ్గ రీచ్‌ ఉండదని భావిస్తున్నారని సమాచారం. దీన్ని బట్టి విడుదలకు సిద్ధమైన సినిమాలన్నీ థియేటర్లు ఓపెన్‌ అయ్యేవరకూ చూడాల్సిందే అన్నమాట..‘‘అభిమాన నటుడి సినిమా తెరపై పడగానే ప్రేక్షకుడికి పూనకం వస్తుంది. ఆ ఫీల్‌ ఓటీటీ మధ్యమంలో ఎలా వస్తుంది? సినిమా సౌండింగ్‌కి, విజువల్స్‌కి ఆస్కార్లు వస్తున్నాయి. అలాంటి ఎఫెక్ట్స్‌ కావాలంటే బొమ్మ వెండితెరపై పడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: