టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన సీనియర్ హీరో నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ పెద్ద తనయుడు రమేష్ బాబు బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వి మధుసూధన రావు దర్శకత్వంలో సామ్రాట్ సినిమా ద్వారా హీరోగా మారారు. ఆపై చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్ టైగర్ ఇలా వరుస పెట్టి చాలా సినిమాల్లో హీరోగా నటించిన రమేష్ బాబు కెరీర్ పరంగా ఆశించిన స్థాయి విజయాలను అయితే అందుకోలేక పోయారు.

ఇక రమేష్ బాబు మాదిరిగానే బాలనటుడిగా నీడ సినిమా ద్వారా పరిచయమైన కృష్ణ చిన్న తనయుడు మహేష్ బాబు ఆపై పలు సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్నాడు. ఆ తరువాత రాజకుమారుడు మూవీ ద్వారా హీరోగా మారిన మహేష్, తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఇక అక్కడి నుండి వరుస విజయాలతో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నేటితరం సూపర్ స్టార్ గా తండ్రికి తగ్గ తనయుడిగా కోట్లాదిమంది ప్రేక్షకాభిమానుల నుండి గొప్ప పేరు దక్కించుకుని కొనసాగుతున్నారు. ఇక తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు, అవార్డులు, రివార్డులు కూడా అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో స్థానానికి దగ్గర గా కొనసాగుతున్న హీరోల్లో ఒకరిగా ఉన్నారు.

అలానే సూపర్ స్టార్ మహేష్ కి ఇటు తెలుగుతో పాటు పలు ఇతర భాషలు సహా విదేశాల్లో సైతం ఎందరో అభిమానులు ఉన్నారు. ఇక మహేష్ నుండి సినిమా వస్తుంది అంటే పలువురు ప్రేక్షకాభిమానులు థియేటర్స్ వద్ద చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఆ విధంగా కృష్ణ తనయుల్లో రమేష్ హీరోగా రాణించలేకపోయినప్పటికీ, మహేష్ బాబు మాత్రం హీరోగా బాక్సాఫీస్ రికార్డులతో రఫ్ఫాడిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు...... !!

మరింత సమాచారం తెలుసుకోండి: