సినిమా పరిశ్రమలో అనగా టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ సహా పలు ఇతర ఇండస్ట్రీల్లో ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాల్లో కొన్ని సినిమాలు సీక్వెల్స్ రూపంలో కూడా విడుదలయ్యాయి. మన దేశంలో ఎక్కువగా రెండు, మూడు భాగాలుగా పలు సీక్వెల్స్ విడుదలైతే ఐదారు భాగాలుగా హాలీవుడ్ సహా మరి కొన్ని ఇండస్ట్రీల్లో విడుదలైన సినిమాలు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని మంచి విజయాలు అందుకోగా మరికొన్ని అపజయం పాలయినవి ఉన్నాయి. కాగా ఇదే సీక్వెల్స్ విధానం తెలుగులోని కొన్ని సినిమాల విషయంలో కూడా అమలు జరిగింది.

కాగా మిగతా సినిమా పరిశ్రమలతో పోలిస్తే తెలుగులో మాత్రం సీక్వెల్స్ పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. గతంలో జేడీ చక్రవర్తి, చిన్న ల కలయికలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మనీ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టగా దాని తర్వాత వచ్చిన మన మనీ మాత్రం ఘోరంగా విఫలమైంది. ఇక ఇటీవల దానికి కొనసాగింపుగా వచ్చిన మనీ మనీ మోర్ మనీ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అలానే మెగాస్టార్ చిరంజీవి హీరోగా జయంత్ దర్శకత్వంలో రూపొందిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టగా దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ గా నిలవగా దాని సీక్వెల్ గా తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. ఇక వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా టాలీవుడ్ లో సీక్వెల్స్ గా విడుదలై చాలావరకు పరాజయాలను మూటగట్టుకున్నాయి. అయితే టాలీవుడ్ లో సీక్వెల్ గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న సినిమాల్లో బాహుబలి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. బాహుబలి సిరీస్ లో మొదటి భాగాన్ని మించేలా రెండో భాగాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కించి గొప్ప విజయాన్ని అందుకున్నారు దర్శకుడు రాజమౌళి.


ఇక అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప మూవీ రెండు భాగాలుగా విడుదల కానుందని ఇటీవల ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ వెల్లడించారు. మొదటి భాగం కంటే రెండవ భాగం మరింత అద్భుతంగా అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కనుందని రవిశంకర్ అన్నారు. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకూ వచ్చిన సీక్వెల్ సినిమాలు చాలావరకు పరాజయం పాలవగా, మరి ప్రస్తుతం రెండు భాగాలుగా రాబోతున్న పుష్ప తద్వారా ఎంతవరకు సక్సెస్ ని అందుకుంటుందో అంటూ పలువురు ప్రేక్షకాభిమానులు ఆ మూవీ పై అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి పుష్ప రెండు భాగాలూ ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియాలంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: