కరోనాతో పోరాటం చేసి ఇటీవల కన్నుమూసిన ప్రముఖ జర్నలిస్ట్‌, సినీ నటుడు టీఎన్‌ఆర్‌ కుటుంబంలో కరోనా కలకలం రేగింది. "అంతులేని దుఃఖంలో టీఎన్ఆర్ కుటుంబం. ఉందని, టీఎన్ఆర్ తండ్రి, ఇద్దరు పిల్లలకూ కరోనా...సపోర్ట్ చేద్దాం రండి" అంటూ ఆయన స్నేహితుడు మరో యూట్యూబ్ యాంకర్ అయిన బుర్రా శ్రీనివాస్ పేర్కొన్నారు. మనకు తీరని ద్రోహం చేసి అనంతలోకాలకు వెళ్లిపోయిన టీఎన్ఆర్, చిన్నప్పుడే అమ్మను పోగొట్టుకున్న అభాగ్యుడనీ ఆయన అన్నారు. 




రెక్కల కష్టం మీద పైకి వచ్చిన అపార జ్ఞానవంతుడు, ఎంత అద్భుతంగా రాస్తాడు..ఎంత అద్భుతంగా డైరెక్షన్ చేస్తాడు.. ఎంత అద్భుతంగా ఇంటర్వూలు చేస్తాడు..తను ఎల్బీ శ్రీరామ్ దగ్గర ఓనమాలు నేర్చుకుని..కొన్ని సినిమాలకు దర్శకత్వంలో శిక్షణ పొంది నా దగ్గరకు వచ్చాడనీ ఆయన పేర్కొన్నారు.. అతని మాటలు..ఆత్మవిశ్వాసం.పనిపట్ల అతనికి ఉన్న అంకిత భావం చూసి..హెడ్ గా ఉన్న నాకంటే ఎక్కువ శాలరీ ఇచ్చానన్న ఆయన,నా నమ్మకం వమ్ము కాలేదు, అద్భుతమైన ఎపిసోడ్స్ షూట్ చేశాడని అన్నారు. అద్భుతంగా ప్రోగ్రామింగ్ చేశాడు అని అన్నారు.



హైదరాబాద్ లో నిలదొక్కుకోవడానికే దాదాపు 20 ఏళ్లకు పైగా టైమ్ పట్టిందన్న ఆయన ఆర్థికంగా కాస్త నిలదొక్కుకుని మహా అయితే ఓ మూడేళ్లవుతుందేమో...అప్పుడే విధి తన జీవితంతో ఆడుకుంది..కానరాని లోకాలకు తీసుకుపోయిందనీ అన్నారు. 
ఎంత విషాదం అంటే..ఇప్పుడు టీఎన్ఆర్ భార్య తప్ప ఆఇంట్లో ఉన్న అందరికీ కరోనా, ఇద్దరు పిల్లలకు కరోనా, టీఎన్ఆర్ తండ్రిగారికీ కరోనా, టీఎన్ఆర్ భార్యకు ప్రస్తుతానికి నెగెటివ్...ఆ తర్వాత ఎలా ఉంటుందో తెలీదు...వాళ్లకు ఎన్ని డబ్బులున్నాయో..ఏంటో తెలీదనీ అందుకే మనమూ తలా ఓ చేయి వేద్దాం అని అన్నారు. ఇక టీఎన్ఆర్ కుటుంబానికి ఐ డ్రీమ్ చైర్మన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక చిరంజీవి, సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్ళు కూడా సాయం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: