టాలీవుడ్ లో తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు నాని.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు స్టార్ హీరో గా ఎదిగాడు.. ప్రస్తుతం మూడు సినిమాలు ఆయనవి సెట్స్ పైన ఉన్నాయి.. నాని హీరోగా తెరకెక్కుతున్న టక్  జగదీష్ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో జగత్ బాబు కీలక పాత్రలో నటిస్తుండగా, రీతు వర్మ హీరోయిన్ గా నటించింది.. తొలి రెండు సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన శివ నిర్వాణ ఈ సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు..

ఇక నాని చేస్తున్న మరో సినిమా శ్యామ్ సింగ రాయ్.. టాక్సీవాలా చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాకు దర్శకుడు.. సాయి పల్లవి కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల కాగా ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది.. ఇక ఈ సినిమాతో పాటే నాని తన ఇరవై ఎనిమిదో చిత్రాన్ని "అంటే సుందరానికి" అనే సినిమా చేయబోతున్నాడు..

వెరైటీ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మరో చిత్రానికి కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే నాని నటిస్తున్న  శ్యామ్ సింగ రాయ్ లో అయన ఓ డిటెక్టీవ్ పాత్రలో మెరవబోతున్నారట. ఇదో కామెడీ అండ్ థ్రిల్లింగ్ డిటెక్టివ్ స్టోరీ అని.. 'షెర్ లాక్ హోమ్స్' - సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన 'డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి' సినిమాల తరహాలో ఉంటుందని అంటున్నారు. అయితే గతంలో నాని డిటెక్టివ్ గా గండ లీడర్ సినిమాలో నటించగా అది ఫ్లాప్ అయ్యింది.. మళ్ళీ డిటెక్టివ్ అంటే అభిమానులు ఈ సినిమా ని అనుమానిస్తున్నారు..  నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని సమాచారం.' శ్యామ్ సింగ్ రాయ్' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన నాని - సాయి పల్లవి ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: