తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు.. వారిలో కొద్దిమంది మాత్రమే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.. అలాంటి వారిలో ఒకరు రాశి.. అందాల రాశిగా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుని ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించుకున్నారు రాశి.. అనతికాలంలోనే అప్పట్లో ని స్టార్ హీరోలతో జతకట్టి ఆమె ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు.. దాదాపు పదేళ్ల పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగి, ఆమె కెరీర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాల నుండి తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది..

పెళ్లి తర్వాత కొన్ని ఛాన్స్ లు వచ్చిన కూడా చేయాలేనంటూ తిరస్కరించి ఆ తర్వాత మెల్ల మెల్లగా సినిమా పరిశ్రమకు దూరం అయిపోయారు రాశి.. తిరిగి లంక అనే చిత్రంతో ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఈ ఎంట్రీ లో అప్పట్లగానే దూసుకు వెళుతోంది.. ప్రస్తుతం ఓ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న రాశి సినిమాల్లో కూడా నటించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది రాశి..

తన పెళ్లి జీవితం గురించి కూడా కొన్ని ఆశక్తికర విషయాలను ప్రేక్షకులతో పెంచుతుంది.. నా భర్త శ్రీమునినీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను.. అప్పట్లో నన్ను పెళ్లి చేసుకోమని నేనే మొదట ప్రపోజ్ చేశాను.. మొదట్లో నన్ను పెళ్లి చేసుకోమని ఎంతోమంది డబ్బున్న వారు మరియు వ్యాపారవేత్త లు నా వెంట పడ్డారు కానీ శ్రీ ముని నా మనసుకు దగ్గర కావడంతో ఆయనే పెళ్లాడాను.. నేను హీరోయిన్ గా చేస్తున్న ఓ సినిమా కి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు .. అప్పుడే మా మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి పెళ్లి దాకా వచ్చింది.. ఆ తర్వాత నేను నటించిన చాలా సినిమాలకు ఆయన సహాయ దర్శకుడిగా పని చేశారు..  మా నాన్నగారు చనిపోవడంతో ఆయన ఎంతో ధైర్యం చెప్పి ఇంకా దగ్గరయ్యారు.. అలా నేను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను.. అయన్ను మనస్ఫూర్తిగా నమ్మాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను .. మొదట ఆయన ఆశ్చర్యపోయారు.. తర్వాత ఓకే చెప్పడంతో ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది రాశి..

మరింత సమాచారం తెలుసుకోండి: