ఒక్కో దర్శకుడు ఒక్కో విషయంలో తమ పనితనం చూపిస్తూ ఉంటారు. అలాగే త్రివిక్రమ్ కూడా జనం అంతా మర్చిపోయిన ఒకప్పటి హీరోయిన్లను తీసుకు వచ్చి మళ్ళీ వాళ్లకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేలా చేయడంలో సిద్ధహస్తుడు. ఆ విధంగా అత్తారింటికి దారేది సినిమాలో నదియాను తీసుకొచ్చి ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా మార్చేశాడు. ఆ తర్వాత ఆయన చేసిన అజ్ఞాతవాసి సినిమా తేడా పడింది గాని లేకపోతే కుష్బూ కూడా ఈపాటికి బిజీ స్టార్ గా మరి ఉండేది. బలమైన లేడీ ఓరియెంటెడ్ పాత్రలు రాసుకోవడంలో త్రివిక్రమ్ ది అందెవేసిన చేయి. 

వర్మ ఎలా అయితే సరిగ్గా పోలికలు ఉన్న వారిని ఎలా క్యాస్టింగ్ చేస్తాడో, త్రివిక్రమ్ కూడా అలాగే తాను రాసుకున్న పాత్రకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్లనే వెతికి రంగంలోకి దిగుతాడు. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ దాదాపు పూర్తయినట్టే అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ ఇప్పుడు నటీ నటుల క్యాస్టింగ్ ప్రాసెస్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక తన గత సినిమాల లాగానే ఇందులో కూడా ఒక పవర్ఫుల్ లేడీ పాత్ర ఉంటుందని అంటున్నారు.

అయితే ఇప్పటికే లైన్ లో ఉన్న వారిని కాకుండా ఫేడవుట్ అయిపోయి ప్రస్తుతానికి ఎవరికీ అందుబాటులో లేని హీరోయిన్స్ లో ఎవరో ఒకరిని మళ్ళీ లైన్లో పెడదామని ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఇది ఈసారి పెళ్లి చేసుకుని సెటిల్ అయిన ఒక బాలీవుడ్ హీరోయిన్ ని తెలుగులోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడింది అలాగే 31 వ తారీఖున కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: