మనందరికీ సూపర్ స్టార్ కృష్ణ కొడుకు అంటే మహేష్ బాబు మాత్రమే గుర్తొస్తాడు. కానీ తన పెద్ద కొడుకు రమేష్ బాబు గురించి చాలా మందికి తెలియదు. రమేష్ బాబు కూడా బాలనటుడిగా పరిచయమై హీరో రేంజ్ కు ఎదిగిన వ్యక్తి. ఇక ఆ తర్వాత కృష్ణ నటించిన ఎన్నో సినిమాలలో హీరో చిన్ననాటి వేషాల్లో నటించాడు రమేష్ బాబు. ఆ తర్వాత వి.మధుసూదనరావు దర్శకత్వంలో వచ్చిన "సామ్రాట్ " సినిమా ద్వారా హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు రమేష్ బాబు. అయితే రమేష్ బాబు సినిమాలు ప్రజలను పెద్దగా ఆదరించ లేకపోయాయి. దాంతో ఎన్కౌంటర్ మూవీ తర్వాత ఇక సినిమాల్లో నటించడం మానేశారు..


అయితే రమేష్ బాబు నటించిన కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. అందులో ప్రధానంగా సాహసయాత్ర మూవీ కూడా ఒకటి.. ఈ చిత్రానికి వంశీ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ సినిమాకు మబ్బు చంద్రశేఖర్ రెడ్డి సమర్పణలో నూరా రవీంద్ర రెడ్డి, టీవీఎస్ రెడ్డిలు నిర్మాతలుగా చేయడానికి ముందుకు వచ్చారు.. అయితే కృష్ణకు ఈ కథ ఓకే కావడంతో రమేష్ బాబు తో 1987లో జనవరి 30న మద్రాస్ ప్రసాద్ థియేటర్ లో సిరివెన్నెల రాసిన పాటను ఇళయరాజా మ్యూజిక్ డైరెక్షన్ లో రికార్డు చేశారు.


అయితే ఈ సినిమాకు హీరోయిన్ సెలెక్ట్ కాలేదు. కానీ విలన్ గా అమ్రిష్ పురి ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక సినిమా  షెడ్యూల్స్  కూడా ఖరారయ్యాయి. అంతలోనే ప్రొడ్యూసర్స్ కి, వంశీ కి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో వంశీ పక్కకు తప్పుకున్నాడు. ఇక నిర్మాతలు ఈ విషయాన్ని కృష్ణ కి చెప్పడంతో కె.ఎస్.ఆర్.దాస్ ని డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. దీంతో సినిమా స్టోరీ కూడా మారిపోయింది. ఇక ఈ సినిమాలో కి పరుచూరి బ్రదర్స్ కూడా ప్రవేశం చేశారు. ఇక హీరోయిన్స్ గౌతమి, మహాలక్ష్మి, రూపిని లను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా కోటి వచ్చారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అక్టోబర్ లో స్టార్ట్ అయింది. ఇక అండమాన్లో రమేష్ బాబు, గౌతమి, అలాగే రమేష్ బాబు ,మహాలక్ష్మి ల మీద మొత్తం రెండు పాటలు షూట్ చేశారు..


అయితే బాగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది అని అనుకున్న నేపథ్యంలోని ఆర్థిక కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. ఇక అప్పటికే రమేష్ బాబు  మార్కెట్ డౌన్  కావడంతో ఫైనాన్స్ కూడా దొరకక పూర్తిగా ఆగిపోయింది. ఇక నటనకు పూర్తిగా పుల్ స్టాప్ పెట్టి, రమేష్ బాబు  కృష్ణా ప్రొడక్షన్స్ నెలకొల్పి మహేష్ బాబు హీరోగా అతిధి, అర్జున్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఆ తర్వాత దూకుడు , ఆగడు  సినిమాలకు సమర్పకుడిగా మారాడు రమేష్ బాబు..


మరింత సమాచారం తెలుసుకోండి: