రోడ్డు ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండస్ట్రీలో కూడా చాలా మంది నటులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళు ఎవరో ఒక్కసారి చూద్దామా. నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం చెందారు. 2018 ఆగస్టులో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అయితే ఈయన కుమారుడు జానకీరామ్ అదే నల్గొండ జిల్లాలో2014 డిసెంబర్ 6న రోడ్డు ప్రమాదానికి గురయ్యి దుర్మరణం చెందారు.

ఇక బాబుమోహన్ కుమారుడు పవన్ కుమార్ టూ వీలర్ పై వెళ్తూ, డివైడర్ ని ఢీకొన్న ప్రమాదంలో తనువు చాలించారు. 2010 జూన్ 20న కోట శ్రీనివాసరావు కొడుకు ప్రసాద్ టూ వీలర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఇలా ఇద్దరు స్టార్ కమెడియన్స్ కుమారులు యాదృచ్చికంగా దుర్మరణం పాలయ్యారు. 2014లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో హీరోయిన్ సౌందర్య కన్నుమూశారు.

అలాగే సీరియల్ యాక్ట్రెస్ అనూష, భార్గవి కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2019న వికారాబాద్ లో ఈ ఘటన సంభవించింది. వర్ధమాన నటుడు యశో సాగర్ ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో సూపర్ హిట్ కొట్టి, మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. 2012డిసెంబర్ 19న బెంగుళూరు సమీపంలో కారుప్రమాదంలో తనువు చాలించాడు. మాస్ మహారాజు రవితేజా సోదరుడు భరత్ కూడా కారు ప్రమాదంలో 2017జూన్ 24న మరణించాడు. ఇతడు కూడా కొన్ని సినిమాల్లో రాణించాడు.

ఇక వర్ధమాన కొరియోగ్రాఫర్ సాయి నేపాల్ లో షూటింగ్ ముగించుకుని వస్తూ, 2015ఏప్రియల్ లో కారుప్రమాదంలో మరణించాడు. కో ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన జి కమలాకర రెడ్డి 2020న అంబులెన్స్ లో హాస్పిటల్ కి వెళ్తూ, అదే అంబులెన్స్ నల్గొండ చెక్ పోస్టు వాడపల్లి దగ్గర లారీని ఢీకొన్న ఘటనలో మృత్యువాత పడ్డారు. పద్మావతి, ఏజంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి సినిమాలతో పాటు పలు హాలీవుడ్ మూవీస్ కి పంపిణీ దారుగా కమలాకర్ రెడ్డి వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: