థియేటర్లో బొమ్మ ఆగింది. సినీ అభిమానులకు అసలైన వినోదం కూడా లేకుండా పోయింది. ఓటీటీలు సహా ఎన్ని ఆల్టర్నేషన్లు ఉన్నా కూడా సినిమా హాలు లో బొమ్మ చూసిన ఫీలింగే వేరు. ఇది సగటు ఆడియన్ కచ్చితమైన అభిప్రాయం. ఇదిలా ఉంటే సినిమా బొమ్మకు కత్తెర పడి దాదాపుగా నెల దగ్గర అవుతోంది.

సరే థియేటర్లను మూసేసారు. మళ్లీ ఎపుడు తెరుస్తారు అన్నది చాలా మందికి కలిగే సందేహం. నిజానికి పెద్ద సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ అన్నీ కూడా రిలీజ్ కి క్యూ కట్టి ఉన్నాయి. అయితే ఇక్కడే టాలీవుడ్ కి బిగ్ షాక్ లాంట్ న్యూస్ ప్రచారంలో ఉంది. కరోనా రెండవ దశను పాలకులు చాలా సీరియస్ గా ఇపుడు తీసుకున్నారు. మొదటి దశ మాదిరి ఇది కాదు అన్నది కూడా అందరికీ అర్ధమవుతోంది.

దాంతో కరోనా రెండవ దశలో కేసులు పూర్తిగా తగ్గు ముఖం పడితే తప్ప థియేటర్లు తెరచుకోవు అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది. అన్ని రంగాలకూ వేసిన తాళాలను నెమ్మదిగా ప్రయారిటీ బేసిస్ లో  తీయడానికే ప్రభుత్వాలు దృష్టి పెడతాయని చెబుతున్నారు. గతసారిలా ఈమారు ఎలాంటి కంగారు పడకుండా ప్రజా సమూహం ఎక్కువగా వెళ్లే జిమ్స్, రెస్టారెంట్లు, పార్కులు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితమైన విధానం అనుసరిస్తాయి అంటున్నారు.

ఇక పైన చెప్పిన వాటిలో లాస్ట్  ప్రయారిటీగానే సినిమా హాళ్ళను తెరవడం అన్నది ఉంటుందిట.  అలాగే ఏపీ సర్కార్ విషయం తీసుకుంటే నూటికి నూరు శాతం ప్రజలకు వ్యాక్సిన్ వేస్తే తప్ప థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు ఇవ్వకూడదు అని డిసైడ్ అయినట్లుగా అనధికార వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణా  ప్రభుత్వం కూడా కరోనా తగ్గినా కూడా వెంటనే థియేటర్లకు అనుమతులు ఇవ్వకూడద‌ని భావిస్తోందిట. మొత్తానికి తేలే విషయం ఏంటి అటే 2022 సమ్మర్ వరకూ బడా సినిమాలు అన్నీ క్యూ కట్టి వెయిట్ చేయాల్సిందే అన్నది అందుతున్న సందేశం.


మరింత సమాచారం తెలుసుకోండి: