సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చే హీరోయిన్ లు దాదాపు యంగ్ ఏజ్ టైం లోనే వచ్చి ముప్పై ఏళ్ళవరకు సినిమా లు చేసి ఆ తర్వాత పెళ్లి ళ్లు చేసుకుని సెటిల్ అవుతారు. చేతిలో డబ్బు, ఎదో వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని వారు జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటారు.. కానీ పెళ్ళైన తర్వాత కూడా హీరోయిన్ లుగా చేస్తున్నారు కొంతమంది హీరోయిన్ లు.. తమ భర్తలని పక్కనే పెట్టుకుని ముద్దు సీన్ లలో, బోల్డ్ సీన్ లలో నటిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు.. అలాంటి హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

రాధికా ఆప్టే, కోలీవుడ్ లో రాధికా ఆప్టే కు నటిగా మంచి పేరు తో పాటు బోల్డ్ స్టేట్మెంట్స్ చేసే సెలెబ్రెటీగా పెద్ద పేరే ఉంది.. ఎలాంటి స్టేట్మెంట్స్ చేయడానికైనా ఏమాత్రం వెనుకాడదు.ఇండియా లోని అన్ని ఇండస్ట్రీ లను కవర్ చేసి హాలీవుడ్ లో సైతం నటించే రాధికా ఆప్టే కు పెళ్లయింది అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.. అదితిరావు హైదరి... టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ హీరోయిన్ కి కూడా పెళ్ళైన తర్వాత అదృష్టం కలిసి వచ్చింది.. 2009  లో సత్యదేవ్ మిశ్రా ని పెళ్లి చేసుకుంది..

సుమంత్ మళ్ళీ రావా సినిమా లోహీరోయిన్ గా నటించిన ఆకాంక్ష సింగ్ కి ఆల్రెడీ పెళ్లయింది.. నాని 'అంటే సుందరానికి ' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న బ్యూటీ నజ్రియా కి కూడా పెళ్లి అయ్యింది. బిగ్ బాస్ తో ప్రేక్షకులకు దగ్గరయిన హిమజ కి కూడా పెళ్లి అయ్యింది.. తెలుగు లో కొన్ని సినిమాల్లో చేసిన సనాఖాన్ ఇటీవలే పెళ్లి చేసుకుని హీరోయిన్ గా చేస్తుంది. తెలుగులో రామ్ చరణ్ సరసన మెరిసిన ఏమీ జాక్సన్ కి కూడా పెళ్లయింది.. ఇటీవలే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కూడా...

మరింత సమాచారం తెలుసుకోండి: