తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా దాదాపు అన్ని సినిమా షూటింగ్ లో నిలిచిపోయాయి. అలాగే ఇప్పటికే రిలీజ్ కి సిద్ధమైన సినిమాలు కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మళ్లీ సినిమాలన్నీ ఒకేసారి విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ విషయం అలా ఉంచితే ఈ ఏడాది దసరాకు ముగ్గురు బడా హీరోలు పోటీపడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి మే నెలలో చిరంజీవి నటించిన ఆచార్య, బాలకృష్ణ నటించిన అఖండ, వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. 

కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా దాదాపు అన్ని సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. ఇక అన్ని థియేటర్లు మూసివేసిన నేపథ్యంలో ఇప్పుడు సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు సీనియర్ హీరోల సినిమాలు దసరాకు ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే దసరా నాటికి అయినా మళ్లీ 100% ఆక్యుపెన్సీ థియేటర్లు ఓపెన్ చేస్తారా లేదా అనేది కూడా అనుమానమే. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు సీనియర్ హీరోలు పోటీ పడడం ఆసక్తికరంగా మారింది.. సైరా సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నారు.

 కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. చివరిగా రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ఇప్పుడు తనకు బాగా కలిసి వచ్చిన బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నారు. ఈ కాంబినేషన్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. చివరిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ ఇప్పుడు తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ సినిమాను నారప్ప పేరుతో రీమేక్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: