దగ్గుబాటి రానా సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా విరాటపర్వం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు వేణు ఉడుగుల కొన్ని ఆసక్తికర అంశాలు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సినిమా గురించి ఆయన అనేక విషయాలు పంచుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు విరాటపర్వం టైటిల్ పెట్టడానికి గల కారణం కమర్షియల్ యాంగిల్ అని చెప్పుకొచ్చారు. సినిమా నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న కారణంగా దానికి ఏవైనా కమ్యూనిస్టు టైటిల్స్ పెడితే అందరూ కనెక్ట్ అవ్వరు అనే కారణంగా ఈ టైటిల్ పెట్టామని చెప్పుకొచ్చారు.


 విరాట పర్వం అంటే దాక్కోవడం అనే అంశం సూచిస్తుందని ఈ సినిమా కథ కూడా దాదాపు ఇలాగే ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా మా పరిటాల రవి జీవిత నేపథ్యంలో తెరకెక్కుతుందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఆయన జీవితంలో నక్సలిజం ఒక భాగం అయి ఉండొచ్చు కానీ ఈ సినిమాకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఒక నక్సలైట్ తో ప్రేమలో పడిన ఒక యువతి కోణంలో ఈ సినిమా తెరకెక్కుతుందని ఆయన అన్నారు. ఈ సినిమా గత ఏడాది రిలీజ్ కావాల్సి ఉందని కానీ రానా పెళ్లి ఆయన అనారోగ్యం దృష్ట్యా ఈ సినిమా ఇప్పటి దాకా రిలీజ్ కాలేదని అని చెప్పుకొచ్చారు.


 అంతేకాదు ఈ సినిమాలో సాయి పల్లవి ఏదో ఒక బూతు మాటలు మాట్లాడిన అంశం మీద ఆయన ఆసక్తికరంగా స్పందించారు. మనం ఉపయోగించే చాలా బూతు పదాలు స్త్రీని ఉద్దేశించి ఉంటాయని, కానీ ఇది అందుకీ భిన్నం అని ఆయన చెప్పుకొచ్చారు. ఇది కొత్త పదం కాదన్న ఆయన ఇది పాత సాహిత్యంలో ప్రస్తావించబడిందని అన్నారు. ఆ కాలపు నిపుణులు కూడా చర్చించారని అన్నారు. ఇక సినిమాలో దీన్ని మ్యూట్ చేయమని సెన్సార్ బోర్డు కోరిందని అన్నారు. అయితే యూట్యూబ్‌లో మాత్రం మార్చలేదని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: