నాటి నుండి నేటి వరకు సినీ ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోల నుండి నటుల వరకు, చాలామంది రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే సీనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించి , రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ప్రజల మనసుల్లో దేవుడిగా నిలిచారు. ఇక ఆయనే కాకుండా ఆ తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ ,రజినీకాంత్, ఇక  వీరితో పాటు విజయశాంతి, రోజా వంటి ఎంతో మంది ప్రముఖులు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు.. అయితే ఈ రాజకీయాలో ఎంట్రీపై ఇటీవల ఆర్జీవీ స్పందించారు..


ప్రముఖ దర్శకుడు కాంట్రవర్సి కి మారుపేరు అయిన రాంగోపాల్ వర్మ  రాజకీయాల్లోకి వస్తున్నారా ? ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారా ? అనే వార్తలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తున్నాయి. అయితే వర్మ  త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే రూమర్లపై స్పందించాడు. రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదు అని కుండబద్దలు కొట్టాడు వర్మ. అంతేకాకుండా పేదలకు సేవ చేయాలనే కోరిక నాలో లేదని కూడా చెప్పేశాడు.. ఒక ప్రముఖ తెలుగు వార్త ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు..


ముఖ్యంగా చెప్పాలంటే నాయకుల పై వర్మ తనదైన శైలిలో స్పందిస్తారు అనే సంగతి అందరికీ తెలిసిందే. స్థానికంగా ఉన్న నాయకుల నుంచి జాతీయ స్థాయిలో ఉన్న నేతల వరకు , అందరి పైన  ఆయన సెటైర్స్ వేస్తుంటారు. అయితే ఒక్కోసారి కొంతమంది నాయకులు ఆర్జీవి గురించి తెలిసి లైట్ గా తీసుకుంటే, మరికొంతమంది వివాదాలకు దిగేవారు.. అయితే ఇటీవల వర్మ ని విలేకరి.. మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందాఅని అడగగా.. అప్పుడు వర్మ  రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశాడు.. ప్రజలకు సేవ చేయాలనుకునేవారు మాత్రమే రాజకీయాల్లోకి వస్తారు. నాకు అలాంటి ఆలోచన కూడా లేదు.అందుకే నేను రాజకీయాల్లోకి రావడం లేదు అంటూ ఆయన శైలిలో సమాధానం ఇచ్చాడు ఆర్జీవి..


మరింత సమాచారం తెలుసుకోండి: