రాగా దగ్గుబాటి లేటెస్ట్ మూవీ విరాటపర్వం. ఈ మూవీ మూవీ మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ సొసైటీలోని ఒక సీరియస్ ఇష్యూని బేస్ చేసుకుని రూపొందించారు. రానా ఫస్ట్ టైమ్ నక్సలైట్ నాయకుడిగా నటిస్తున్నాడు. ఇక సాయిపల్లవి కూడా నటనకు స్కోప్ ఉన్న పాత్రలో కనిపిస్తోంది.

అన్నీ అనుకూలిస్తే ఈ మూవీ వచ్చే నెలలో థియేటర్లలోకి వచ్చేది. అయితే కరోనా రెండవ వేవ్ బీభత్సంగా ఉంది. ఇక ఇప్పట్లో సినిమా హాళ్ళు తెరచుకోవు. దాంతో విరాటపర్వం కూడా అన్ని సినిమాల మాదిరిగానే వెయిట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఒక అద్భుతమైన ఆఫర్ ఈ మూవీకి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఓటీటీ ద్వారా ఈ మూవీని రిలీజ్ చేయడానికి రెడీ అయితే మాత్రం అంతకంటే క్రేజీ ఆఫర్ కూడా ఉండదు అంటున్నారు.

ఏకంగా 30 కోట్ల రూపాయలు ఈ మూవీకి ఒక ఓటీటీ సంస్థ  ఆఫర్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఓటీటీ వారు ఇప్పటిదాకా తీసుకున్న సినిమాలతో పోల్చితే విరాటపర్వానికే ఎక్కువ రేటు ఇచ్చి కొంటున్నట్లుగా లెక్క అని కూడా అంటున్నారు. గతంలో కొన్ని సినిమాలు స్ట్రెయిట్ గా ఓటీటీకి వచ్చినా వాటికి ఇందులో సగం రేటు కూడా ఇవ్వలేదుట. కానీ ఈ మూవీ మీద ఉన్న  అంచనాలను దృష్టిలో పెట్టుకునే ఈ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు.

మరి ఈ మూవీ మేకర్స్ కనుక ఓకే అంటే ఇది మంచి బిజినెస్ అనే అంటున్నారు. ఇప్పట్లో సినిమా హాళ్ళు తెరవరు, ఒకవేళ తెరచినా కూడా ఫిఫ్టీ ప‌ర్సెంట్ ఆక్యుపెన్సీతోనే రన్ చేయాలి. జనాలు కూడా ఎంత మటుకు వస్తారు అన్నది కూడా ఒక డౌట్. ఇవన్నీ ఆలోచిస్తే కనుక విరాటపర్వానికి వచ్చిన ఆఫర్ సూపర్ అనే మాట ఉంది. కానీ థియేటర్లోనే రిలీజ్ చేయాలని భావిస్తే మాత్రం ఈ క్రేజీ ఆఫర్ కి విలువ లేనట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: