సుమన్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తొలిరోజులలో అతడికి ఆ తరం యూత్ లో ముఖ్యంగా అమ్మాయిలలో విపరీతంగా క్రేజ్ ఉండేది. అందంతో పాటు మార్షల్ ఆర్ట్స్ లో ప్ర్రవేశం ఉన్న కారణంగా కెరియర్ తొలినాళ్లలోనే సుమన్ కు చాల త్వరగా విపరీతమైన క్రేజ్ రావడమే కాకుండా ఆరోజులలో చిరంజీవికి పోటీ ఇవ్వగల  హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్  ఎర్పర్చుకున్నాడు.


ఇక అతడు నటించిన సినిమాలకు భారీ విజయాలు కూడ తోడవ్వడంతో  సుమన్ కు వరసగా సినిమాలు వచ్చాయి. సుమన్ ఏపాత్రను చేసినా ఏ దర్శకుడు కూడ అసంతృప్తిని వ్యక్త పరచలేదు. పాత్ర్ర పరిధిని దాటి వెళ్ళడంగానీ అతిగా ప్రవర్తించడం కానీ చేయకుండా సుమన్ గంభీరంగా ఉంటాడు. అందువల్లనే సుమన్ ను ఎక్కువకాలం హీరోగా ప్రేక్షకులు అంగీకరించారు.


యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలలోనే కాదు భక్తి సినిమాలలోను నటించి రాముడుగా, వెంకటేశ్వరస్వామి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. దర్శకుడు శంకర్ ప్రోతాహంతో హఠాత్తుగా ‘శివాజీ’  సినిమాలో విలన్ గా కనిపించాడు. ఆమూవీలో తన పాత్రను బాగా నటించడంతో సుమన్ కు విలన్ గా భారీ సినిమాలలో అవకాశాలు వస్తాయని అందరు భావించారు అయితే అలా జరగలేదు. జగపతిబాబు ప్రకష్ రాజ్ ల మాదిరిగా విలన్ పాత్రలకు సంబంధించి సుమన్ కు అవకాశాలు రాలేదు.


టాప్ విలన్స్ రేంజ్ లో విలేజ్ స్థాయి విలనిజాన్నీ కార్పొరేట్ లెవెల్ విలనిజాన్ని సుమన్ బాగా  నప్పించలేడు అన్న భావంతో దర్శకులు అతడిని పక్కకు పెట్టి బాలీవుడ్ - మాలీవుడ్ - శాండిల్ వుడ్  నుండి సీనియర్ హీరోలకు విలన్ లుగా అవకాశాలు ఇస్తున్నారు కాని సుమన్ కు ఎవరు అవకాశాలు ఇవ్వకపోవడం చాలమందిని ఆశ్చర్యపరుస్తోంది. సుమన్ బుల్లితెర ఎంట్రీకి సంబంధించి కొన్ని చారిత్రాత్మక సీరియల్స్ లో నటిస్తున్నా అక్కడ కూడ సుమన్ విలక్షణ నటనకు గుర్తింపు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటం చాలామందికి సమాధానం లేని ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి: