టాలీవుడ్ లో ఆ నలుగురి పెత్తనం అంటూ అప్పట్లో విమర్శలు వస్తూ ఉండేవి. అయితే అలాంటిది లేదని ఖండనలు కూడా వచ్చేవి. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో కొందరి గుత్తాధిపత్యం ఇప్పటికీ సాగుతోందని చిన్న నిర్మాతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక కరోనా సంక్షోభంలో కొత్త మార్గాలు తెరచుకున్నాయి. అందులో ఓటీటీ కూడా ఒకటి. ఓటీటీ ఫ్లాట్ ఫారం ఇపుడు చిన్న నిర్మాతలకు, చిన్న సినిమాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది అంటున్నారు. అయితే ఇక్కడ కూడా ఇపుడు పోటీ పెరుగుతోంది అంటున్నారు. ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూటింగ్ వ్యవస్థతో పాటు థియేటర్లు కూడా కొందరి చేతుల్లో ఉన్నాయని ప్రచారం ఉంది.

తమ సినిమాలకు ముందే థియేటర్లు లాక్ చేసుకుని చాలా మంది పడుతున్న జాగ్రత్తలు కంటెంట్ ఉన్న సినిమాలకు కష్టంగా మారిందని కూడా విమర్శలు ఉన్నాయి. ఇక ఇపుడు ఓటీటీ రావడంతో కొంత ఇబ్బంది తప్పిందని అంతా భావిస్తున్నారు. అయితే ఇపుడు ఓటీటీల మీద ఆధిపత్యం చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది అంటున్నారు.

ఓటీటీలను కూడా ఇపుడు కొందరు  సొంతంగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన ఓటీటీల మీద కూడా తమ హవా ఉండేలా చూసుకోవడంతో లో బడ్జెట్ మూవీస్ కి ఇబ్బందులు తప్పడంలేదు అంటున్నారు. ఏది ఏమైనా కూడా మంచి సినిమాలు ఏదో ఒక ఫ్లాట్ ఫారం ద్వారా జనాలకు చేరితేనే సినీ సీమ పది కాలాలు వర్ధిల్లుతుంది అంటున్నారు. ఆ దిశగా అంతా కలసి అడుగులు వేయాలని కోరుతున్నారు. అలా చేస్తేనే మంచి సినిమాలు, మేసేజ్ ఓరియెంటెడ్ మూవీస్. సామాజిక స్పృహ కలిగిన సినిమాలు వస్తాయని అంటున్నారు. అలాగే న్యూ టాలెంట్ కి కూడా అవకాశాలు పెరుగుతాయని కూడా అంటున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో అన్ని రకాల జనార్లలో సినిమాలు వచ్చేవి. అలాగే అన్ని రకాల బడ్జెట్ లతో మూవీస్ తీసేవారు. ఎక్కువ మందికి ఉపాధి కూడా దొరికేది. మళ్లీ ఆ రోజులు రావాలని అంతా కోరుతున్నారు.







మరింత సమాచారం తెలుసుకోండి: