టాలీవుడ్ లో ఇద్దరు దిగ్గజాలను ఒక తప్పు విడదీసి మళ్ళీ కలవనీయలేదు.. వారే మేటి నటుడు చిరంజీవి, దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు.. 150 చిత్రాలతో నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఎన్నో ప్రయోగాలతో దర్శకుడికి కొత్త అర్థాన్ని ఇచ్చిన దాసరి నారాయణ లను ఒక తప్పు విడదీసిందట.. ఒకే టైం లో స్టార్ లు  గా వీరిద్దరి కాంబినేషన్ లో ఒకే ఒక సినిమా రావడం ఇప్పటి తరానికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.. ఇప్పుడు దాసరి మరణించడంతో వీరి కాంబో లో సినిమా వచ్చే అవకాశం అయితే లేదు..

అయితే వీరి కాంబో లో ఒక సినిమా రాగా మరొక సినిమా మాత్రం కార్యరూపం దాల్చలేదు.. దాసరి తన 100వ సినిమాని చిరంజీవి తో లంకేశ్వరుడు గా చేశాడు.. చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన 11 ఏళ్ల తర్వాత దాసరి తన దర్శకత్వంలో తొలి సినిమా చేశాడు చిరు తో..  ఇప్పటివరకు ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా పండగ అయ్యింది.. ఎంతో మంది హీరోలతో  బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన దాసరి,  చిరంజీవి తో చేస్తున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది.. దానికి తగ్గట్లు సినిమా కథ కూడా అలానే ఉంది.. డబ్బున్న అహంకారం ఉన్న ధనికులను దోచుకుని పేదవారికి పెట్టే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది..

అయితే సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా రిలీజయ్యాక అదే దీనికి మైనస్ గా మారింది.. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మిగిలిపోయింది.. అలా వీరి కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా సక్సెస్ కాలేదు..  ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా డిజాస్టర్ అయింది.. దాంతో మళ్లీ ఇద్దరు కలిసి సినిమా చేయలేదు.. ఈ సినిమా పోయింది అన్న కారణం వల్లనేమో లేదా క్రియేటివ్ డిఫరెన్స్ వల్లనేమో కానీ వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా అయితే రాలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: