సోషల్ మీడియా సైట్లలో యూ ట్యూబ్ కి వున్న క్రేజ్ వేరనే చెప్పాలి. అన్నిటికంటే టాప్ లో దూసుకుపోతుంది. తమ టాలెంట్ ని నిరూపించుకోవాలంటే యూ ట్యూబ్ చక్కని వేదిక అనే చెప్పాలి. ఇక ఒకప్పుడు యూ ట్యూబ్ లో విదేశీ ఆల్బమ్స్ కాని లేక నార్త్ ఇండియాకి సంబంధించిన వీడియోస్ కానివ్వండి కాని పాటలు కాని బాగా వైరల్ అయ్యేవి. కాని సౌత్ ఇండియా సెన్సేషనల్ హీరో ధనుష్ పాడిన "వై దిస్ కొలవరి డి" సాంగ్ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యి యావత్ ప్రపంచాన్నే సౌత్ ఇండియా వైపు చూసేలా చేసింది. యూ ట్యూబ్ లో రికార్డుల సునామి సృష్టించి ఇంటర్నేషనల్ లెవెల్ లో అప్పుడు బాగా ట్రెండ్ అయ్యింది.


ఇక ఆ తరువాత మెల్ల మెల్లగా సౌత్ ఇండియా సాంగ్స్ కి యూ ట్యూబ్ లో క్రేజ్ పెరిగింది.ఈ మధ్య కాలంలో కూడా మన సాంగ్స్ యూ ట్యూబ్ లో బాగా ట్రెండ్ అయ్యాయి.ఇక "రౌడీ బేబీ" సాంగ్ ఎన్ని సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మరో సాంగ్ వచ్చింది.ఇప్పుడు ట్రెండ్‌ 'ఎంజాయ్‌ ఎంజామీ'ది. మార్చి 7, 2021న యూట్యూబ్‌ లో విడుదలైన ఈ మ్యూజిక్‌ వీడియో కేవలం రెండు నెలల్లోనే 200 మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. గతంలో ఏ తమిళ సింగిల్‌ సాధించని రికార్డు సృష్టించింది.


అరివు సాహిత్యం అందించిన ఈ పాటను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ కూతురు గాయని దీ(దీక్షితా వెంకటేశన్‌) పాడింది. ఈ ఆల్బమ్ కి అమిత్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహించారు.సంతోష్‌ నారాయణ్‌ నిర్మించారు. ఎంజాయ్‌ ఎంజామీ పాటను మాజా లేబుల్‌పై ఏఆర్‌ రెహమాన్‌ విడుదల చేశారు. యూట్యూబ్‌తో పాటు, స్ఫూటిఫై, జియో సావన్‌, గానా, యాపిల్‌ మ్యూజిక్‌, ఐట్యూన్స్‌, అమెజాన్‌ మ్యూజిక్‌, హంగామా, రాగా.కామ్‌ వేదికల ద్వారా కూడా ఈ సాంగ్ వినవచ్చు.


విడుదలైన రెండు వారాల్లోనే స్పోటిఫై మ్యూజిక్ యాప్ లో ఈ పాట 2 మిలియన్‌ స్ట్రీమింగ్స్‌ దాటింది. మార్చి 10న వీడియో అందుబాటులోకి రాగా రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే 200 మిలియన్‌ వ్యూస్‌ దాటేసింది.ఈ పాటకు వందలాది కవర్‌ సాంగ్స్‌ వచ్చాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ ఈ పాటకు తమదైన శైలిలో స్టెప్‌లు వేస్తూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. ఇక కేరళ, తమిళనాడు పోలీసులు కూడా ఈ పాటతోనే కరోనా వైరస్‌, మాస్క్‌ ధరించడంపై అవగాహన కల్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: