17ఏళ్లకే చిత్ర సీమలోకి అరంగేట్రం చేసి అగ్రహీరోగా ఎదిగాడు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్. తెలుగు సినీ ప్రేక్షకుల్లో అతడికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. అతడి నటన, డైలాగ్ డెలివరికీ ఎందరో వీరాభిమానులు ఉన్నారు. అంతేకాకుండా ఎన్‌టీఆర్ సినిమా కొత్తగా ఉంటుందని అభిమానులు ఎదురుచూస్తుంటారు. అంతేకాకుండా అతడి నట విశ్వరూపాన్ని చూడటానికి అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. అతడి సినిమా విడుదల అవుతుందంటే చాలు సినిమా థియేటర్ల ముందు అభిమానులు పోటెత్తుతారు. అదే తరహాలో ఎన్‌టీఆర్ కూడా తనను ఆరాధించే అభిమానులను నిరాశ పరచకూడదని భావిస్తాడు.

అయితే ప్రస్తుతం ఎన్‌టీఆర్ తన తాజా సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. ఇటీవల ఈ సినిమా ఫైనల్ ఫైట్‌ను చిత్రీకరించారు. కానీ కరోనా కారణంగా చివరి షెడ్యూల్ కాస్త ఆలస్యం అవుతోంది. అయితే మే20న ఎన్‌టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ ఏం సర్‌ప్రైజ్ ఇస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కొందరైతే ఈ సినిమా నుంచి భారీ అప్‌డేట్ వస్తుందని, టీజర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఊహిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి రానున్న ట్రీట్ గురించి సరికొత్త వార్త సినీ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. యంగ్ టైగర్ పుట్టినరోజుకి కొమరం భీమ్ పాత్రలో పవర్ ఫుల్ పోస్టర్ వస్తుందని అంటున్నారు. అంతేకాకుండా ఈ పోస్టర్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. మే20న కేవలం పోస్టర్‌ మాత్రమే కాకుండా సరికొత్త రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా అలియా భట్ నటిస్తోంది. ఇందులో అలియా పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుందట. మరి ఈ అప్‌డేట్ ఏంటని తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: