టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తొలిసారిగా వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకొని హీరోగా రామ్ కి బాగా పేరు తెచ్చి పెట్టింది. అనంతరం సుకుమార్ తీసిన జగడం ఫ్లాప్ కాగా ఆపై శ్రీనువైట్లతో రామ్ నటించిన రెడీ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టి హీరోగా రామ్ కి యువత తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో బాగా క్రేజ్ తీసుకువచ్చింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన రామ్ మధ్యలో పలు విజయవంతమైన సినిమాలు చేసారు.

తన ఆకట్టుకునే యాక్టింగ్, స్టైల్, డ్యాన్స్ లతో అదరగొడుతూ దూసుకెళ్తున్న రామ్ ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇస్మార్ట్ శంకర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. ఆపై రామ్ డ్యూయల్ రోల్ రోల్ పోషించిన రెడ్ సినిమా విడుదలై యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక త్వరలో లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితం కానున్న మూవీ లో నటించనున్నారు రామ్. ఇక నేడు రామ్ బర్త్డే కావడంతో పలువురు ఆయన అభిమానులు సినిమా ప్రముఖులు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్సినిమా చేయనున్నారు అంటూ కొద్దీ రోజుల నుంచి ఒక వార్త మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అలానే ఆ మూవీ అధికారిక ప్రకటన రామ్ బర్త్డే రోజు వస్తుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే నేడు ఆ మూవీకి సంబంధించి ఎటువంటి న్యూస్ బయటకు రాకపోవటంతో పాటు అసలు ఇప్పట్లో రామ్ తో త్రివిక్రమ్ సినిమా చేసే ఛాన్స్ లేదని ఇన్నర్ వర్గాల టాక్. మరోవైపు రామ్ ఒక యువ దర్శకుడితో కూడా ఒక సినిమా చేయడానికి ఇప్పటికే కమిట్ అయ్యారని త్వరలో దానికి సంబంధించి అధికారిక న్యూస్ వెలువడనుందని అంటున్నారు. మరి రామ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ మూవీ అసలు ఎప్పుడు ఉంటుందో తెలియాలంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి అంటున్నారు విశ్లేషకులు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: