తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొరటాల శివ స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఈ డైరెక్టర్ నుండి ఇప్పటివరకు నాలుగు సినిమాలు రాగా ఆ నాలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని ఆ సినిమాలలో నటించిన హీరోలకు కెరియర్ బెస్ట్ హిట్స్ గా నిలిచాయి. దీంతో కొరటాల ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఈ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవి తో " ఆచార్య " అనే మూవీ చేస్తున్నాడు. 

మూవీ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయినట్లు సమాచారం. ఇక ఈ సినిమా తరువాత కొరటాల శివ జూ.ఎన్టీఆర్ తో ఓ సినిమా చెయ్యనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడిన సంగతి తెలిసిందే. అయితే మొదట కొరటాల శివ "ఆచార్య " తరువాత అల్లు అర్జున్ తో సినిమా కమిట్ అయినప్పటికి ఎన్టీఆర్ లైన్లోకి రావడంతో ఈ ప్రాజెక్ట్ కాస్త వాయిదా పడింది. అయితే తాజాగా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బన్నీ, కొరటాల ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. 

ఎన్టీఆర్ మూవీ తరువాత కొరటాల శివ ఓ యంగ్ హీరోతో సినిమా చేసే అవకాశం ఉందట. అఖిల్‌ అక్కినేని సురేందర్ రెడ్డితో చేయబోయే మూవీ తరువాత  కొరటాల శివ దర్శకత్వంలో చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే నాగార్జున కొరటాలతో సంప్రదింపులు జరుపుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అఖిల్‌ చేయబోయే 6వ సినిమా కావడంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించాలని నాగార్జున ప్లాన్‌ చేస్తున్నారట. ఇక ఇదే గనుక జరిగితే బన్నీ కొరటాల ప్రాజెక్ట్ కష్టమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడకతప్పదు .

మరింత సమాచారం తెలుసుకోండి: