కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. అయితే ఎంతోమంది ఈ సమయంలో ఉపాధి లేక ఆకలికి అలమటిస్తున్నారు. గత లాక్ డౌన్ లో ఎన్నో స్వచ్చంధ సంస్థలు, వ్యక్తులు రోడ్డుపైకి వచ్చి సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్వచ్చంధ సంస్థలకు చెందినవాళ్ళు కూడా భయటకు రావాలంటే భయపడుతున్నారు. కొంతమంది వచ్చి సహాయం చేసినా గతంలో మాదిరిగా అయితే చేయడం లేదు. కాగా లాక్ డౌన్ వల్ల ఎంతో మంది పనులు కోల్పోగా వారిలో డ్యాన్సర్లు కూడా ఉన్నారు. కొంత కాలంగా సినిమాలు స్టేజ్ షోలు లేక డ్యాన్సర్లు ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అయితే తాజాగా అలాంటి వారికి సహాయం చేసేందుకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ముందుకు వచ్చారు. లాక్ వేళ షూటింగ్ లు లేక ఎంతోమంది  డ్యాన్సర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. టీవీ షోలు షూటింగ్ లు జరిగితే వారికి డబ్బులు వస్తాయని అన్నారు. 

అలాంటి వాళ్ళు సహాయం కొరకు తనను సంప్రదించాలని తెలిపారు. సినిమాల్లో డ్యాన్సర్ లు మాత్రమే కాకుండా పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాల్లో స్టేజ్ షోలు ఇచ్చేవాళ్ళు కూడా తమను సంప్రదిస్తే సరుకులు పంపిస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం కేవలం హైదరాబాద్ లో ఉన్నవాళ్లకు మాత్రమే తాము నిత్యావసరాలు పంపిణీ చేయగలమని చెప్పారు. నిత్యావ‌స‌రాల కోసం ఈ నెంబ‌ర్ల‌కు  9989189885 (అసిస్టెంట్ బాబా), 9618961492 (అసిస్టెంట్ శేఖర్) ఫోన్ చేయాలని చెప్పారు. ఇదిలా ఉండగా శేఖర్ మాస్టర్ ఇండస్ట్రీలో ఒక డ్యాన్సర్ స్థాయి నుండి పెద్ద కొరియోగ్రాఫర్ వరకూ ఎదిగారు. ఇప్పటివరకు ఎన్నో బడా సినిమాలకు కొరియాగ్రాఫర్ గా వ్యవహరించారు. అంతే కాకుండా ప్రస్తుతం బుల్లితెర పై జడ్జ్ గా కూడా సందడి చేస్తున్నారు. ముఖ్యంగా జ‌బ‌ర్ద‌స్త్ కు ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత శేఖ‌ర్ మాస్టర్ క్రేజ్ మ‌రింత పెరిగిపోయింది. ఆ త‌ర‌వాత చాలా షోలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: