దేశంలో కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు అండగా నిలిచి రియల్ హీరో అయ్యాడు సోనూసూద్. ఆయనను కలియుగ కర్ణుడు అని కొంతమంది సంబోధిస్తూ ఉన్నారు. అయితే కరోనా రాకముందు దర్శకనిర్మాతలు, హీరోలు, ప్రజలు సోనూసూద్ ను కేవలం నటుడిగా మాత్రమే చూసేవారు. విలన్ ఇమేజ్ తో పాపులారిటీ సంపాదించుకున్న సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో పేద ప్రజల పాలిట దేవుడిగా మారారు. ప్రజల్లో చాలామంది సోనూసూద్ పై విపరీతమైన అభిమానాన్ని పెంచుకోవడంతో పాటు సోనూసూద్ పై ఎవరైనా విమర్శలు చేస్తే కౌంటర్లు ఇస్తున్నారు.

అయితే ఇప్పుడు దర్శకనిర్మాతలకు మాత్రం సోనూసూద్ ఇమేజ్ తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ఇక మారిన పరిస్థితుల నేపథ్యంలో దర్శకులు సోనూసూద్ ను క్రూరమైన విలన్ గా చూపించే ధైర్యం చేయలేకపోతున్నారు. ఒకవేళ విలన్ గా చూపిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో హీరోలు సోనూసూద్ ను కొట్టినా ఆయన అభిమానులు తట్టుకుంటారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది రిలీజైన అల్లుడు అదుర్స్ సినిమాకు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కు ఇదే సమస్య ఎదురైందని తెలుస్తోంది. సంతోష్ శ్రీనివాస్ సోనూసూద్ కు లాక్ డౌన్ సమయంలో వచ్చిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఆయన పాత్రలో మార్పులు చేశారు. అయితే ఆ మార్పుల ప్రభావం సినిమా రిజల్ట్ పై పడింది.

ఇరాక్ ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ సైతం ఆచార్య సినిమా కథకు సంబంధించించి సోనూసూద్ పాత్రలో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇక రోజురోజుకు సోనూసూద్ కు రియల్ హీరో ఇమేజ్ పెరిగిపోతుండటం వల్ల సోనూసూద్ భవిష్యత్తులో విలన్ రోల్స్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని చిత్ర [పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు సోనూసూద్ హీరో పాత్రల్లో నటించినా ప్రేక్షకులు ఆయనను హీరోగా అంగీకరిస్తారా..? అని కొంతమంది నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: