బాలయ్యకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేకత ఉంది. బాలయ్య బాల నటుడిగా పద్నాగేళ్ళ ప్రాయంలోనే ముఖానికి మేకప్ వేసుకుని సినీ రంగంలో ప్రవేశించారు. అంతే కాదు ఆయన నాటి నుంచి నాటౌట్ అన్నట్లుగా ఇప్పటిదాకా నటిస్తూనే ఉన్నారు.

ఇక బాలయ్య వంద సినిమాల హీరోగా కూడా ఈ తరంలో రికార్డు సృష్టించారు. బాలయ్య అన్ని రకాలైన జానర్లలో సినిమాలు చేశారు. బాలయ్య పౌరాణికాలు, జానపదాలు, చారిత్రాత్మక చిత్రాలు చేశారు. ఇక సాంఘీకాల్లో బాలయ్య అనేక రకాలైన పాత్రలు చేశారు. అదే సమయంలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా, ఫ్రాక్షనిస్ట్ గా కూడా  పాత్ర పోషణ చేశారు. ఇవన్నీ కూడా హిట్ అయ్యాయి.

ఇక బాలయ్య రైతు బిడ్డగా పంచె కట్టి చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్లు గా నిలిచాయి. బాలయ్యకు సోలో హీరోగా తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన మంగమ్మగారి మనవడు లో ఆయన పంచె కట్టి రైతుగా అదరగొడతారు. ఆ తరువాత వచ్చిన ముద్దుల క్రిష్ణయ్య మూవీలో పల్లెటూరి యువకుడిగా పంచె కట్టుతో హుషార్ చేస్తారు. ఆ మూవీ కూడా సూపర్ హిట్. అలాగే  ప్రెసిడెంట్ గారి అబ్బాయి మూవీ లో కూడా రైతుగా బాలయ్య నటించి శభాష్ అనిపించుకున్నారు.

ఇలా ఎన్నో సినిమాలు బాలయ్య తన కెరీర్ తొలినాళ్లలో చేసి హిట్లు కొట్టారు. సాధారణంగా పంచె కట్టు అందరికీ నప్పదు, కానీ బాలయ్య ఆ వేషం కడితే బొమ్మ సూపరే అన్నట్లుగా ఉంటుంది. అలాంటి జానర్ లో బాలయ్య సినిమా చేసి దశాబ్దాలే అయింది. బాలయ్య ఎన్నో రకాల పాత్రలు పోషిస్తున్నారు కానీ తనకు సూపర్ హిట్లు ఇచ్చిన ఆ జానర్ ని మాత్రం పక్కన పెట్టేశారు అని ఫ్యాన్స్ ఫీల్ అవుతూంటారు. బాలయ్య ఆ మధ్యన క్రిష్ణ వంశీ డైరెక్షన్ లో రైతు మూవీ చేస్తారు అనగానే ఫ్యాన్స్ హుషారెత్తారు. కానీ ఆ మూవీ ఎందుకో ఆగింది.  ఇప్పటికైనా బాలయ్య గ్రామీణ నేపధ్యంలో పంచె కట్టు తో అదిరిపోయే పాత్ర పోషించాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. మరి బాలయ్య ఈ జానర్ మీద దృష్టి పెడితే సూపర్ హిట్లు వస్తాయని అని రాసుకోవాల్సిందే అంటున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: