తమిళ సినిమా పరిశ్రమకు అర్జున్ హీరోగా రూపొందిన జెంటిల్ మ్యాన్ సినిమా ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పట్టి ఫస్ట్ మూవీతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన శంకర్, ఆ తరువాత ప్రేమికుడు, ఒకే ఒక్కడు, భారతీయుడు, జీన్స్ ఇలా వరుసగా పలు సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తూ దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ఇటీవల విక్రమ్ తో అపరిచితుడు, ఐ అలానే రజినీకాంత్ తో శివాజీ, రోబో, 2.0 సినిమాలతో దేశవిదేశాల్లో కూడా దర్శకుడిగా మరింత ఖ్యాతిని అందుకున్న శంకర్ కు అన్ని వర్గాల ఆడియన్స్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు 2 మూవీ తీస్తున్న శంకర్ త్వరలో రామ్ చరణ్ తో ఒక భారీ పాన్ ఇండియా మూవీ తీయనున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఎస్ ఎస్ రాజమౌళి ఆ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర ఇలా ఒక్కో సినిమాతో ఒక్కో విజయాన్ని అందుకుంటూ ఇటీవల ప్రభాస్ తో తీసిన బాహుబలి రెండు సినిమాల గొప్ప విజయాలతో దర్శకుడిగా విశ్వవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ అనే భారీ పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే ఎప్పటినుండో రాజమౌళి, శంకర్ లలో ఎవరు గొప్ప విషయమై పలు సినిమా వర్గాల్లో, ఆడియన్స్ లో ఒక చర్చ జరుగుతోంది.

అయితే భారీ స్థాయిలో సినిమాలను తీసి దానికి మెసేజ్ తో పాటు గ్రాండియర్ గా టెక్నీకల్ హంగులు అద్దడంలో శంకర్ దిట్ట, అలానే హీరోయిజాన్ని పీక్స్ లో చూపించడంతో పాటు అంతకుమించే స్థాయిలో విలన్ ని కూడా చూపిస్తూ యాక్షన్, ఎమోషనల్ హంగులను సమపాళ్లలో చూపిస్తూ సినిమాలు తీయగల దిట్ట రాజమౌళి. వీరిద్దరి మధ్యన తేడా ఏంటంటే శంకర్ ది సినిమా యొక్క టెక్నీకల్ నాలెడ్జి కలిగిన టాలెంట్ అయితే రాజమౌళి ది యాక్షన్, ఎమోషన్ మీద పట్టు అని అంటున్నారు. ఇక వీరిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పాలంటే ఇద్దరూ అని చెప్పవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి ఈ ఇద్దరు దర్శకులు కూడా భారతీయ సినిమా ఖ్యాతిని తమ టాలెంట్ తో ఉన్నతస్థాయికి తీసుకెళ్లారని, రాబోయే రోజుల్లో వీరు తీయబోయే సినిమాలు మరింత గొప్ప విజయాలు అందుకుని దూసుకెళ్లడం ఖాయం అని వారు అంటున్నారు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: