టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తన అభిమానులకు అండగా నిలుస్తున్నారు. తన మాటలతో వారికి ఓదార్పునిస్తున్నారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయిన అభిమానులతో వీడియో కాల్ లో మాట్లాడుతున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. ఈ కష్టకాలంలో వారికి కావాల్సిన మానసిక స్థైర్యాన్ని అందిస్తున్నారు. ఇటీవల సాయి స్మరణ్ అనే నవీన్ పోలిశెట్టి అభిమాని తండ్రి కరోనాతో కన్నుమూశారు. సాయి స్మరణ్ తల్లి ఈ బాధతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆమె మనసు వేరే పనుల మీదకు మరల్చేందుకు "జాతిరత్నాలు" సినిమాను తల్లికి చూపించాడు సాయి స్మరణ్. ఆ సినిమా చూస్తూ మనసు తేలిక చేసుకుందా తల్లి. ఈ విషయాన్ని నవీన్ పోలిశెట్టికి ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు సాయి స్మరణ్. నవీన్ పోలిశెట్టి వెంటనే సాయి మదర్ తో ఫోన్ లో మాట్లాడి ఓదార్చారు. ప్రియమైన వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తాను ఊహించగలనని, ఇలాంటి కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పారు. కరోనా కష్టాల్లో ఉన్న వారితో మాట్లాడి, మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి
అందరికీ విజ్ఞప్తి చేశారు.


ఇదిలా ఉండగా ఏజెంట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన చిచోరే సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంతో బాలీవుడ్ లోనూ నవీన్ కు అభిమానులు పెరిగిపోయారు. ఇక ఇటీవల విడుదలైన జాతిరత్నాలు సినిమాతో మాత్రం సాలిడ్ హిట్ అందుకున్నారు నవీన్ పొలిశెట్టి. కరోనా లాక్ డౌత్ తరవాత విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యింది. అంతే కాకుండా సినిమాకు వసూళ్ల వర్షం కురిసింది. ఇదిలా ఉండగా నవీన్ చేతి నిండా ఆఫర్లతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా డిమాండ్ కు తగినట్టుగా రెమ్యునరేషన్ ను కూడా పెంచినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: