‘వైల్డ్ డాగ్’ మూవీ కోసం నాగార్జున చాల కష్టపడ్డాడు. తన లుక్ ను మార్చుకోవడమే కాకుండా తన నటనకు సంబంధించి బాడీ లాంగ్వేజ్ లో కూడ మార్పులు చేసుకుని ఈనాటి తరం ప్రేక్షకులను ఆకర్షించడానికి నాగ్ ఎన్ని ప్రయత్నాలు ఉంటాయో అన్ని ప్రయత్నాలు చేసాడు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కాక ముందే ఈమూవీ విడుదల కావడంతో అప్పట్లో ధియేటర్ల విషయంలో కానీ ఆక్యుపెన్సీ విషయంలో కానీ ఎటువంటి సమస్యలు రాలేదు.


అయితే ఈమూవీకి కనీస స్థాయిలో కూడ ఓపెనింగ్ కలక్షన్స్ రాకపోవడంతో నాగ్ ఆలోచనలలో పడి తన భవిష్యత్ సినిమా ప్రాజెట్ల విషయంలో చాల మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల ఫలితంగా స్క్రిప్ట్ రెడీ అయి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాగార్జున నటించవలసిన సినిమా ఆగిపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈమూవీ ప్రారంభోత్స‌వం కూడా జ‌రిగింది. ఈ చిత్రం కోస‌మే నాగ్ కొంచెం గ‌డ్డం పెంచి డిఫ‌రెంట్ లుక్‌ లోకి మారిపోయాడు.




ఈ మూవీలో నాగార్జున చేస్తున్నది స్పెష‌ల్ కాప్ పాత్ర అవ్వడంతో విదేశాల్లో ఫేమ‌స్ అయిన మార్ష‌ల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోవడానికి సంబంధించి ఆన్ లైన్ క్లాసులు కూడ తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఈసినిమా ఆగిపోయింది అన్నప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ‘వైల్డ్ డాగ్’ మూవీ ఫలితం అంటున్నారు.


తెలుస్తున్న సమాచారం మేరకు నాగార్జున ఇక పై ప్రయోగాత్మక సినిమాలలో నటించకూడదని కేవలం కమర్షియల్ టచ్ ఉన్న సినిమాలలో మాత్రమే నటించాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అదుపులోకి వచ్చాక తన ‘బంగార్రాజు’ మూవీని లైన్ లో పెట్టి అతి త్వరలో పూర్తి చేయాలని ఒక స్థిర నిర్ణయం తీసుకున్నట్లు లీకులు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా నాగార్జునకు ప్ర‌వీణ్‌తో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఈ సినిమా ఆగిపోయింద‌నే ప్ర‌ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా నాగ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రవీణ్ సత్తార్ కు ఊహించని షాక్ అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: